చంద్రయాన్-2తో ఎవ్వరూ వెళ్లని చోటుకు మనం వెళ్తున్నాం: ఇస్రో చీఫ్ శివన్
చంద్రయాన్-2తో ఎవ్వరూ వెళ్లని చోటుకు మనం వెళ్తున్నాం: ఇస్రో చీఫ్ డా కె శివన్
న్యూ ఢిల్లీ: చంద్రయాన్-2 నేడు చంద్రుడిపై దిగుతుండటాన్ని ఇస్రో(ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్)తో పాటు యావత్ భారత దేశం ఓ సంబరంలా జరుపుకుంటోంది. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగే క్షణం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇది కేవలం భారత్‌కి చెందిన విజయం కాదు.. యావత్ భూ ప్రపంచం మేలు కోరి ఇస్రో చేసిన అనేక ప్రయోగాల్లో ఇదీ ఒకటి. జూలై 22న చంద్రయాన్-2 మిషన్ ప్రయోగించగా.. 23 రోజులపాటు భూ కక్ష్యలోనే భూమి చుట్టూ తిరిగిన రాకెట్.. ఆగస్టు 14న భూ కక్ష్యను వీడి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. దాదాపు ప్రయోగం చేపట్టిన అనంతరం 45 రోజులకు నేడు అర్థరాత్రి దాటిన తర్వాత చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్-2పైనే యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ఇదే విషయమై ఇస్రో చీఫ్ డా కె శివన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చంద్రుడిపై మానవమాత్రుడు ఎవ్వరూ వెళ్లని చోటుకు మనం వెళ్తున్నాం అని ఆనందం వ్యక్తంచేశారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ.. చంద్రయాన్-2 చంద్రుడిపై సురక్షితంగానే ల్యాండ్ అవుతుందని ఆశిస్తున్నట్టు డా కె శివన్ తెలిపారు. ఈ విజయంతో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ కూడా చేరనుండటం.