Mamata Banerjee: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన ఇండియా కూటమిలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత ఎక్కడా కనిపించడం లేదు. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు సహకరించడం లేదు. ఢిల్లీ, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి మిత్రపక్షాలు పోటీ చేయడం లేదు. వాటిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. కానీ కలిసి ఉన్నామని ప్రకటించి బెంగాల్‌లోని అన్ని స్థానాల్లో తృణమూల్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే మమతా బెనర్జీ మరో షాక్‌ ఇచ్చారు. ఇండియా కూటమి ప్రభుత్వంలోకి తాము రామని ప్రకటించి సంచలనం రేపారు. బయటి నుంచి మాత్రమే మద్దతిస్తామని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌


 


సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వస్తే తాము బయటి నుంచి మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతం ప్రచారం చేస్తున్న మమతా బుధవారం మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల సరళిపై ఆమె స్పందించారు. 'ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌లో బీజేపీ ఓడిపోతుంది. ఇక మిగిలిన మూడు దశల ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలు ఎక్కడా లేవు' అని తెలిపారు. ఎంతో హడావుడి సృష్టిస్తున్నారు కానీ వాళ్లు గెలవేరని పేర్కొన్నారు. 'కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అని అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. మేం ఇండియా కూటమికి నాయకత్వం అందిస్తాం. సాధ్యమైనంత ఇండియా కూటమి ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తాం' అని ప్రకటించారు.

Also Read: Kishan Reddy: రేవంత్‌ మాటలు విని నవ్వుకున్న ప్రజలు.. బీజేపీకే బ్రహ్మాండమైన ఫలితాలు


 


'400 పార్‌ అని నినాదం బీజేపీ మంచిగానే ఇస్తోంది. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి కూడా 2004లో భారత్‌ వెలుగుతోంది అని గొప్పగా చెప్పారు. కానీ ఏం జరిగింది. ప్రతి ఒక్కరూ గెలుస్తామనే ధీమాలో ఉంటారు. కానీ ఎన్డీయేకు ఓటు వేయరాదనే మూడ్‌లో దేశం, ప్రజలు ఉన్నారు' అని మమతా బెనర్జీ తెలిపారు. కాగా నిన్నటి ప్రచారంలో మమత మాట్లాడుతూ.. '300 సీట్లతో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది' అని ప్రకటించారు. కానీ మరుసటి రోజే ఆమె కూటమిలో చేరమని.. బయట నుంచి మద్దతు ప్రకటిస్తామని చెప్పడం విస్మయానికి గురి చేసింది.


కాంగ్రెస్‌తో విభేదాలు
ఇండియా కూటమి ఏర్పాటులో మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం చేయడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. అయితే ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో జరిగిన చర్చలో భేదాభిప్రాయాలు వచ్చాయి. మల్లికార్జున్‌ ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా కొందరు ప్రతిపాదించడంపై మమతకు కోపం తెప్పించింది. ఇక అప్పటి నుంచి ఇండియా కూటమికి దూరంగా జరిగింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మమతకు బద్దశత్రువైన సీపీఐ (ఎం)తో కలిసి పోటీకి దిగడం మమతకు మరింత కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఇండియా కూటమికి మమత దూరమవుతున్నారు. ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కూడా అక్కడ కూడా బయటి నుంచి మద్దతు అందించే యోచనలో మమత ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter