Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో రాజధాని వాసులు ఉక్కపోతను అల్లాడిపోతున్నారు.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో రాజధాని వాసులు ఉక్కపోతను అల్లాడిపోతున్నారు. మరో వారంరోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు ఐదు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండి..తీవ్ర వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
శనివారం ఒక్కరోజే 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో వేడి గాలులు వీస్తాయని..వడ దెబ్బ సైతం తగిలే అవకాశం ఉందని..వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని చాలా చోట్ల 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో వాతావరణ మార్పు ఆందోళన కల్గిస్తోంది. రాజధానిలో పీల్చే వాయువులో నాణ్యత సరిగా లేదని వాతావరణ శాఖ చెబుతున్నారు.
సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే..దానిని గరిష్ట ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తారు. 6.5 నాచ్‌లు అధికంగా ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతగా..గరిష్ఠ ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటితే మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా..ఎండలు మాత్రం తగ్గడం లేదు. చాలా చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలు..సాయంత్రం కాగానే చిరుజల్లులు కరుస్తున్నాయి.
దేశంలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేరళలో మాత్రమే రుతుపవనాలు విస్తరించాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ దాటి నార్త్ ఇండియాలో ప్రవేశించనున్నాయి. దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపైనే రైతాంగం ఆధారపడి ఉంటుంది. త్వరలో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Also read: BJP Strategy: కమలనాథులకు ఆ ముచ్చట తీరుతుందా..? ప్రధాని మోదీ ఏమంటున్నారు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook