Weather Report Today: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో స్కూల్స్ బంద్

Schools Closed Due to Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో నేడు హాలీ డే ఇవ్వగా.. ఘజియాబాద్ జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు బంద్ కాన్నాయి.
Schools Closed Due to Heavy Rains: ఉత్తరాదిన భారీ వర్షాలకు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో గత 41 ఏళ్లలో లేనంతగా రికార్డుస్థాయిలో భారీ వర్షం కురస్తోంది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్‌తో సహా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వర్షాల ఎఫ్టెక్ట్‌తో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్, గురుగ్రామ్‌లో సోమవారం స్కూల్స్ బంద్ కానుండగా.. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో పాటు కన్వర్ యాత్రను దృష్టిలో ఉంచుకుని జూలై 15 వరకు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని నగరాల్లో పాఠశాలలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేట్ స్కూల్స్ కూడా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు ఏర్పాట్లు చేశాయి. సోమవారం కూడా ఢిల్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురుగ్రామ్‌లో వర్షంతో పాటు నీరు నిలిచిపోవడంతో పాఠశాలలను మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. హిమాచల్‌లో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని స్కూల్స్, కళాశాలలకు రేపు, ఎల్లుండి సెలవులు ఇచ్చారు. ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది.
అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నేటి నుంచి జూలై 17వ తేదీ వరకు స్కూల్స్ బంద్ కానున్నాయి. కన్వర్ యక్ష దృష్ట్యా ఇక్కడ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. యూపీలోని ఘజియాబాద్‌తో పాటు ముజఫర్‌నగర్‌లో కూడా కవాడ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు హాలీ డేస్ ఇచ్చారు. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో 1982 జూలైలో ఢిల్లీని అతలాకుతలం చేసిన వర్షాలు.. మళ్లీ ఇప్పుడు అంతకుమించి కురుస్తుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
Also Read: Tomato Offers: రూ.20కే కిలో టమాటా.. క్షణాల్లో ఖాళీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి