Calling Unknown Womans To Darling Is Harassment: మన దేశంలో అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఒకరితో మరోకరు గౌరవంగా మెలుగుతారు. ఒకరిమనస్సు నొచ్చుకునే విధంగా, అగౌరవంగా అస్సలు మాట్లాడారు. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అవతలి వారి మనస్సు నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఏమాత్రం పరిచయంలేని వారిని ఇష్టమున్నట్లు సంభోదిస్తుంటారు. ఇక నార్మల్ గా ఉన్నప్పుడే కొందరికి నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. ఇక.. మద్యం మత్తులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు ఇష్టమోచ్చినట్లు బూతులు మాట్లాడుతారు. తెలిసిన వాడని, తెలియని వారని తేడా లేకుండా నానా రచ్చ చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Parenting Tips For Parents: మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. అయితే మీరు ఈ విషయం గమనించారా?


మనం ట్రాఫిక్ పోలీసులపైకి కొందరు, రూల్స్ అతిక్రమించి మద్యం మత్తు లో నానా రచ్చ చేయడం తరచుగా చూస్తుంటాం. తాగిన మైకంలో నోటికొచ్చినట్లు మాట్లాడతారు. బూతులు తిడుతుంటారు. కొందరు మహిళలు అని కూడా చూడకుండా.. ఇష్టమున్నట్లు కామెంట్ లు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి వార్తలలో నిలిచింది. ఒక వ్యక్తి తాగిన మైకంలో లేడీ కానిస్టేబుల్ ను పట్టుకుని డార్లింగ్ అంటూ పిలిచాడు. దీంతో ఆమె అతగాడిపై కేసు పెట్టింది. ఈ కేసు కలకత్తా కోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ క్రమంలో జడ్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 


అండమాన్ నికోబార్ లోని పోర్టు బ్లేయర్ లో జరిగిన ఘటనలో కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలలో నిలిచింది. దుర్గా పూజ నేపథ్యంలో గతేడాది.. మహిళ కానిస్టేబుల్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక తాగు బోతు అక్కడ న్యూసెన్స్ చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. అప్పుడు తాగుబోతు జనక్ రామ్ అనే వ్యక్తి మహిళా కానిస్టేబుల్ ను డార్లింగ్ అంటూ పలుమార్లు కామెంట్ చేశాడు. దీంతో ఆమె అతడిపై కేసు నమోదు చేసింది. ఈ కేసు కలకత్తా కోర్టులో విచారణకు వచ్చింది.


దీనిపై హైకోర్టు పోర్ట్ బ్లెయిర్ బెంచ్‌లోని సింగిల్ జడ్జి జస్టిస్ జే సేన్‌గుప్తా, మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు. 354 ఏ, 509  సెక్షన్ ల కింద తీవ్రమైన నేరమని అన్నారు. ఈ కేసులో.. నిందితుడు జనక్ రామ్... "క్యా డార్లింగ్, చలాన్ కర్నే ఆయీ హై క్యా? (హాయ్, డార్లింగ్, జరిమానా విధించడానికి వచ్చారా?)" అని మహిళా కానిస్టేబుల్ (కేసులో ఫిర్యాదుదారు)ని జనక్ రామ్ అడిగాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసిన స్థానిక కోర్టులో నిందితుడిని హజరుపర్చారు.  


ఈ ఘటనలో, నార్త్ అండ్ మిడిల్ అండమాన్‌లోని ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, మాయాబందర్ IPC సెక్షన్లు 354A(1)(iv) ,  509 కింద నేరాలకు పాల్పడినందుకు జనక్ రామ్‌ను దోషిగా నిర్ధారించి, మూడు నెలల జైలుకు పంపారు . అతనికి జరిమానా విధించారు. రెండు నేరాలకు ఒక్కోదానికి రూ. 500 జరిమాన కూడా విధించారు. దీనిపై జనక్ రామ్ చేసిన అప్పీల్‌ను నవంబర్ 2023లో అదనపు సెషన్స్ జడ్జి, నార్త్ & మిడిల్ అండమాన్ తిరస్కరించారు. తర్వాత, అతను కలకత్తా హైకోర్టులో ప్రస్తుత పిటిషన్‌ను దాఖలు చేశాడు.


Read More: Khan Trio Dance: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలీవుడ్ ఖాన్స్.. వీడియో వైరల్


ఈ క్రమంలోనే తాజాగా, కలకత్త హైకోర్టు మనకు తెలియని, పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలడం క్రిమినల్ నేరం కిందకు వస్తుందని స్పష్టం చేసింది.  అసలు, ముక్కు మోహం తెలియని మహిళలను పట్టుకుని, దిగజారీ ఇలా ప్రవర్తించడం భారతీయ సంప్రదాయం కాదని కలకత్త కోర్టు తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook