Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
CM Mamata Banerjee Sensational Comments On PM Modi:కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా.. కేంద్రంలో అధికారంలో బీజీపీ ఈసారి హ్యట్రిక్ సాధించాలని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. మరోవైపు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా తమదైన స్టైల్ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. ఇదిలా ఉండగా.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా, అవకాశందొరికినప్పుడల్లా బీజేపీనీ ఏకీపారేస్తుంటారు.
Read More: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..
ఈ క్రమంలో తాజాగా, ఆమె లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలుచుకునే స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నినెలలుగా బీజేపీ ఈసారి లోక్ సభ ఎన్నికలలో తప్పకుండా 400 పైన స్ఠానాలు గెలుచుకుంటుందనిప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా.. ఈసారి బీజేపీ 400 కాదు కదా.. 200 కూడా గెలుచుకునే అవకాశం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా బీజేపీ అపోసిషన్ నేతలమైద ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, ప్రత్యర్థులు లేకుండా చేయాలని చూస్తుందంటూ ఆమె మండిపడ్డారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో గతంలో 200 సీట్లు గెలుస్తామన్న బీజేపీ, కేవలం 77 స్థానాలు మాత్రమే గెలిచిందని ఆమె గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మమతా ఎంపీ మహువా మొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, మహువా మొయిత్రాపై లేని అభాండాలు వేసి లోక్ సభ ఎన్నికల నుంచి బహిష్కంచారని మమతా అన్నారు.
ప్రస్తుతం టీఎంసీ మరోసారి మహువా మొయిత్రాను.. కృష్ణానగర్ నుంచి ఎన్నికల బరిలో నిలిపింది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా చేసిన చట్టాలు సీఏఏ, ఎన్ఆర్సీ లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్ లో ఎట్టి పరిస్థితుల్లో సీఏఏ, ఎన్ఆర్సీలను అనుమతించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల సీఎం మమతా బెనర్జీ ఇంట్లో జారీపడి తీవ్రగాయలపాలైయ్యారు. తాజాగా, ఆమె కోలుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఎన్నికలో బీజేపీ అనుకున్న స్థానాలు మాత్రం గెలవదని మమతా జోస్యం చెప్పారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటనతీవ్ర దుమారం రెకెత్తిస్తుంది. ఈడీ కూడా తన దూకుడు పెంచింది. ఇప్పటికే ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి, కోర్టులో హజరు పర్చగా, కోర్టు తీహర్ జైలుకు పంపింది. ఇక ఇదే కేసులో అరవింత్ కేజ్రీవాల్ ను సైతం అరెస్టయ్యారు. తాజాగా, ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు తీహర్ కు పంపిస్తూ రిమాండ్ విధించింది. వీరీతో పాటు దేశంలో అనేక మంది నేతుల ప్రస్తుతం ఈడీ నోటీసులు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook