West Bengal election result live updates: న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జి మరోసారి విజయం సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల సరళి గణాంకాల ప్రకారం దీదీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి 202 స్థానాల్లో ఆధిక్యత చాటుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 అసంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇప్పటివరకు 286 స్థానాల్లో అభ్యర్థుల విజయంపై స్పష్టత ఏర్పడింది. 202 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ చాటుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ అభ్యర్థులు 79 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్లో మరోసారి విజయఢంకా మోగించిన మమతా బెనర్జీకి దేశం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో విజయం సాధిస్తామని బీజేపి పూర్తి ధీమాతో ఉంటూ వచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఊహించని షాక్‌ని ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Also read : Mamata Banerjee Victory: నందిగ్రామ్‌లో ఉత్కంఠ రేపిన కౌంటింగ్, 12 వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మమతా బెనర్జీ


మమతా బెనర్జీ (Mamata Banerjee) విజయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ దీదీకి కంగ్రాట్స్ చెప్పారు. దీదీ పార్టీ విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు అని ట్వీట్ చేసిన రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh).. మరోసారి అధికారం చేపట్టబోతున్న దీదీకి శుభాకాంక్షలు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook