West Bengal Minister Subrata Mukherjee passes away at 75: పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆ‍స్పత్రి(SSKM Hospital)లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. గుండెపోటు(cardiac arrest) కారణంగానే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణవార్తను సీఎం మమతా బెనర్జీ ధృవీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్వాసకోశ సమస్యల కారణంగా అక్టోబరు 24న ఆస్పత్రిలో మంత్రి(Subrata Mukherjee) చేరారు. యాంజియోప్లాస్టీ(angioplasty)  చేయించుకున్న ముఖర్జీ గురువారం రాత్రి 9.22 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ (Firhad Hakim) తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం ప్రభుత్వ ఆడిటోరియంలోని రవీంద్ర సదన్‌కు తరలించనున్నారు. అక్కడ నుంచి బాలిగంజ్( Ballygunge)లోని ఇంటికి, ఆపై అతని పూర్వీకులు ఇంటికి తరలించనున్నారు.


Also Read: Bihar spurious liquor: బిహార్‌లో పండుగ పూట విషాదం..కల్తీ మద్యం తాగి 24 మంది మృత్యువాత


ఆయన మరణం పట్ల సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee)తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు.  ఆయన మరణవార్త విన్న వెంటనే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మమత మంత్రి వర్గంలో ఆయన కీలక మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్‌ శాఖ సహా పలు ఇతర శాఖలను బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి