West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్‌లో 'స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ)' స్కామ్ సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛట్టర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 26 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం (జూలై 23) తెల్లవారుజామున మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మంత్రి సహకరించట్లేదని.. ఆయన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెడుతామని ఈడీ అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే కేసులో మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా దాదాపు రూ.20 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ డబ్బుకు అర్పితా ముఖర్జీ వద్ద ఎటువంటి లెక్కా పత్రం లేదని గుర్తించారు. మంత్రి పార్థా, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీతో పాటు బెంగాల్ ఎస్ఎస్‌సీ మాజీ సలహాదారు శాంతి ప్రసాద్ సిన్హా, ఎస్ఎస్‌సీ బోర్డు మాజీ అధ్యక్షుడు కల్యాన్‌మోయ్ గంగూలీ ఇంట్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. మరోవైపు, ఈడీ దాడులు కుట్రపూరితమని టీఎంసీ ఆరోపిస్తోంది.


అసలేంటీ ఎస్‌ఎస్‌సీ స్కామ్ :


పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఎస్‌సీ కమిషన్ గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం 2014లో ఒక నోటిఫికేషన్‌ని విడుదల చేసింది.  2016లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 500 మందిని అక్రమంగా అపాయింట్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ అవకతవకలపై బెంగాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. మంత్రి పార్థా హయాంలోనే ఇదంతా జరగడంతో గతంలో సీబీఐ ఆయన్ను విచారించింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. తాజాగా పార్థాను విచారించిన ఈడీ.. విచారణకు సహకరించట్లేదనే కారణంతో ఆయన్ను అరెస్ట్ చేసింది.


Also Read: Amazon Prime Day: అమెజాన్‌ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది.. ఇవాళ, రేపు ఆఫర్ల జాతర.. కస్టమర్స్‌కు పండగే..


Also Read: Covid Cases:దేశంలో  భారీగా పెరిగిన కేసులు, మరణాలు.. కొవిడ్ కల్లోలం తప్పదా? .



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.