Update on West Bengal Train Accident News: పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చాలా భోగీలు పట్టాలు తప్పాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓండా స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి మరో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 12 గూడ్స్ భోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. అదేవిధంగా ప్లాట్‌ఫారమ్‌, సిగ్నల్‌ రూం ధ్వంసం అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓడా రైల్వే స్టేషన్ సమీపంలోని లూప్ లైన్‌పై ఆగిఉన్న గూడ్స్‌ను బంకురా నుంచి వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఒక ఇంజన్‌తో పాటు రెండు గూడ్స్ రైలులోని 12 భోగీలు పట్టాలు తప్పినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో అద్రా-ఖరగ్‌పూర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు రైళ్లు ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని రైల్వే అధికారులకు సమాచారం అందించారు. గూడ్స్ డ్రైవర్‌ను రక్షించారు. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్


ప్రమాదానికి గల కారణం ఏమిటి..? రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయి..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనతో ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు సాధ్యమైనంత త్వరగా లైన్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గూడ్స్ రైలు అతివేగం కారణంగా ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి ఇంజిన్ పైకి ఎక్కింది. ఇటీవల ఇదే తరహాలో ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర విషాద ఘటన ఇంకా కళ్ల ముందు మెదుతుండగానే.. వరుసగా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది.


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి