ముంబై : మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా పోటెత్తిన వరదలు పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మహారాష్ట్రలోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మహారాష్ట్ర నుంచి ఒడిషా, గుజరాత్, రాజస్థాన్‌లోని పలు నగరాలకు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ముంబై -పూణే మార్గంలోని మీరాజ్-లోండా సెక్షన్‌లోని రైలు పట్టాలను వరదనీరు ముంచెత్తడంతో పలు రైళ్లను రద్దు చేసి, ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179444","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కొల్హాపూర్ -తిరుపతి, మణుగూరు- కొల్హాపూర్, షోలాపూర్- కొల్హాపూర్, కొల్హాపూర్ -బీదర్, నాగపూర్-కొల్హాపూర్ మార్గాల్లో రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా మీరాజ్ -కాస్ట్ లీ రాక్ మార్గంలో నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పూరి-ఎల్టీటీ, పూరి-అజ్మీర్, సూరత్ -పూరి రైళ్లను దారి మళ్లించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణం సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.