Civilians killed in Nagaland: నాగాలాండ్​లోని మోన్​ జిల్లాలో జరిగిన కార్పుల ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై కచ్చితంగా వివరణ ఇచ్చి తీరాలన్నారు రాహుల్​. అసలు హోం మంతిత్వ శాఖ ఏం చేస్తోందని.. మన దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారా? అంటు ప్రశ్నించారు.




మమతా బెనర్జీ ఎమన్నారంటే..


నాగాలాండ్ ఘటన దురదృష్టకరమన్నారు పశ్చిమ్ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.




అసలు నాగాలాండ్ కాల్పులు ఎందుకు జరిగాయి?


నాగాలాండ్​ మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన మోన్​లో.. మిలిటెంట్ల కదలికలు గుర్తించినట్లు సమాచారం అందింది. ఈ సమయంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ.. అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించికుని వెళ్తున్న కార్మికులు అటుగా వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో జరిపిన కార్పుల వల్ల 13 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.


ఘటనపై విచారణకు ఆదేశం..


ఈ ఘటనపై అటు కేంద్రం, ఇటు నాగాలాండ్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించనున్నట్లు స్పష్టం చేశాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి.


Also read: Third Wave of Corona: ఇండియాలో ఒమిక్రాన్​ ఐదో కేసు- థార్డ్​ వేవ్​ తప్పదా?


Also read: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రికార్డు- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి