డిసెంబర్ 16, 2012న ఏం జరిగింది?
దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో నిర్భయ ద్వారకలోని ఇంటికి వెళ్లాలనుకుంది. ఆటో కోసం చూస్తున్న నిర్భయ, ఆమె స్నేహితుడు అరవింద ప్రతాప్ పాండే ప్రైవేట్ బస్సు కనిపించగా అందులో ఎక్కారు.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులను ఎట్టకేలకు ఉరితీశారు. తొలుత జనవరి 22వ తేదీన ఆ కామాంధులకు మరణశిక్షను అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు అధికారులను ఆదేశించింది. అయితే దోషులు ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లు తమ లాయర్ ఏపీ సింగ్ సాయంతో క్యూరేటివ్ పిటిషన్లు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ల పేరుతో రెండు నెలలపాటు కాలయాపన చేశారు. చివరగా నేటి ఉదయం 5:30 గంటలకు నలుగురు నిందితుల ఉరిశిక్షను అమలు చేశారు.
నిర్భయ ఘటన రోజు అసలు ఏం జరిగింది?
దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో నిర్భయ ద్వారకలోని ఇంటికి వెళ్లాలనుకుంది. ఆటో కోసం చూస్తున్న నిర్భయ, ఆమె స్నేహితుడు అరవింద ప్రతాప్ పాండే ప్రైవేట్ బస్సు కనిపించగా అందులో ఎక్కారు. అప్పటికే అందులో ఆరుగురు మగాళ్లున్నారు. కొంతదూరం వెళ్లాక బస్సును దారి మళ్లించారు. ప్రశ్నించగా నిర్భయ స్నేహితుడు అరవింద్‌ను రాడ్డుతో కొట్టగా స్పృహ తప్పాడు.
నిర్భయ దోషులను ఉరితీసిన తిహార్ జైలు అధికారులు
బస్సు డోర్ లాక్ చేసిన ఆ నిందితులు నిర్భయను వెనుక సీట్లోకి ఈడ్చుకెళ్లారు. మద్యంమత్తులో ఉన్న ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు నిర్భయపై అత్యాచారం చేశారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన నిర్భయను చిత్రహింసలకు గురిచేశారు. అత్యాచారాన్ని ప్రతిఘటించాలని యత్నించిన బాధితురాలిపై భౌతికదాడులకు పాల్పడ్డారు. మరింత రెచ్చిపోయిన ఆ కామాంధులు అత్యాచారం చేసిన తర్వాత తుప్పుపట్టిన ఇనుపరాడ్డును నిర్భయ మర్మావయాల్లోకి జొప్పించి పైశాచిక ఆనందం పొందారు.
కామాంధుల దాడి ఘటనలో నిర్భయ జననాంగాలు ఛిద్రమయ్యాయి. చివరకు నగ్నంగా, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిర్భయను, ఆమె స్నేహితుడిని బస్సు నుంచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అరవింద్ ఆ భయానక ఘటన వివరాలను పోలీసులకు వివరించాడు. కానీ మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అక్కడ రెండు రోజుల చికిత్స తర్వాత ఆమె కన్నుమూసింది. మా కూతురు తిరిగిరాదు.. ఆమె ఆత్మ శాంతిస్తుంది: నిర్బయ తల్లి
అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారించారు. నిందితులలో ఒకరు మైనర్ కాగా, మూడేళ్ల శిక్ష విధిస్తూ జువైనల్ హోంకు తరలించారు. మూడేళ్ల తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. కేసు విచారణలో ఉండగా.. బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మిగతా నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. పాటియాలా కోర్టు చివరి డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20న ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ కేసు దోషులను ఉరితీశారు. దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..