What Happens If You Dont Have FASTag: ఫిబ్రవరి 15, 2021 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గల ఫాస్టాగ్ (FASTag)ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. డిజిటల్ పేమెంట్ రూపంలోనే నేటి నుంచి టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టోల్ ఛార్జీలు రెట్టింపు వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ జరిమానా సైతం వసూలు చేయాలని FASTag కొత్త నిబంధనను తీసుకొచ్చారు. తద్వారా వాహనదారులు డబుల్ టోల్ ట్యాక్స్, జరిమానాలు చెల్లించాల్సి రావడం వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.


Also Read: ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి


ఫాస్టాగ్ లేని వాహనదారులు తొలిసారి అయితే రూ.300 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. రెండోసారి ఫాస్టాగ్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.500 జరిమానా వసూలు చేస్తారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు(Vehicles At Toll Plaza) నేరుగా టోల్ గేట్లను దాటుకుండా వెళ్లిపోతాయి. పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేవైసీ ద్వారా ఫాస్టాగ్(FASTag) అందిస్తుంది.


Also Read: BSNL Promotional Offer: ఈ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటా, మరిన్ని ప్రయోజనాలు


టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల ఇంధనంతో ప్రయాణికుల సమయం వృథా అయ్యేది. ఫాస్టాగ్‌ను మీ వాహనానికి అతికించుకుంటే మీకు ఈ సమయం, ఇంధనం  వృథా సమస్య తగ్గుతుంది. ఫాస్టాగ్‌లో భాగంగా వాహనాల వెరిఫికేషన్ సైతం పనిలో పనిగా పూర్తవుతుంది.


తొలుత జనవరి 1,2021 నుంచే ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయాలని భావించారు. అయితే ఫిబ్రవరి 15 అర్దరాత్రి నుంచి అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ నిమిత్తం 23 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫాస్టాగ్ స్టిక్కర్‌ జారీ అయిన 24 నుంచి 48 గంటల్లోపు ట్యాగ్ యాక్టివ్ అవుతుంది.


Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook