e Pan Card Download Process: ఈ మధ్యకాలంలో ఇ డాక్యుమెంట్ ఎక్కువగా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.  ఇ ఆధార్, ఇ  పాన్ కార్డు ఇలా అన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటే సరిపోతుంది. ఇవి మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా మెయిల్‌లో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా వినియోగించవచ్చు. ఆర్ధిక సంబంధిత అంశాలకు అయితే పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇ పాన్ కార్డును సులభంగా ఇంట్లో కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ పాన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఎవరూ దొంగిలించే పరిస్థితి ఉండదు. ఇ పాన్ కార్డు అనేది ఓ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఇ పాన్ కార్డు కోసం ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి. ఇందులో క్విక్ లింక్స్ ఆప్షన్ ఎంచుకుని అందులో ఇన్‌స్టంట్ ఇ పాన్ క్లిక్ చేయాలి.


ఇప్పుడు గెట్ న్యూ ఇ పాన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయుంజడాలి. పుట్టిన తేదీ వివరాలు పూర్తిగా ఉండాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీతో ధృవీకరించాలి. ఇక ఆ తరువాత మీ మెయిల్ ఐడీ వంటి ఇతర వివరాలు నమోదు చేయాలి. చివరిగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. అంతే పాన్ కార్డు మీ స్క్రీన్‌పై కన్పిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని పీడీఎఫ్ ఫార్మట్‌లో సేవ్ చేసుకోవాలి. 


Also read: Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook