EL Nino Effect Explained in Telugu: రుతుపవనాల రాకకు ఇంకా మూడు నెలల సమయం ఉంది కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్ నినో వలన శీతాకాలాలు కూడా వెచ్చగా ఉంటాయి, వర్షం లేకుండా, వేసవి కాలం మరింత వేడిగా మారనుంది. ఇక అవి మాత్రమే కాదు దాని వలన తుపవనాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే సంభవించాయని ఎంకే గ్లోబల్ పరిశోధనా నివేదిక చెబుతోన్నా క్రమంలో ఈ సంవత్సరం వ్యవసాయోత్పత్తులు తక్కువగా ఉండవచ్చు అని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని పరిశోధన నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్ నినో ప్రభావం 55 నుండి 60% వరకు ఉంటుందని అంచనా వేసింది. ఎల్ నినో, లా నినా అనేవి వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి అనే సంగతి చాలా మందికి తెలుసు కానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి క్లారిటీ లేదు అనడం అతిశయోక్తి కాదు. ఎల్ నినో అంటే వర్షాభావ పరిస్ధితి కాగా లా నినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి అనే ఒక్క మాటలో చెప్పే వివరణ.


స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాల యేసు అని అర్ధం,  డిసెంబర్ నెలలో ఎల్ నినో వాతావరణ పరిస్ధితి కీలకమైన దశకు చేరుతుందని, క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ లో వస్తుంది గనుక క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఎల్ నినో అని నామకరణం చేశారని చెబుతూ ఉంటారు. లా నినో కూడా స్పానిష్ పదమే ఇంగ్లీష్ లో దాని అర్ధం ‘ద గర్ల్’, ఎల్ నినో కు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది గనుక ‘ద బాయ్’ విరుద్ధ పదం అయిన ‘ద గర్ల్’ గా దానిని సంభోదిస్తున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఈ ఎల్ నినో – లా నినా లకు కారణం అవుతాయని అంచనా. 


పసిఫిక్ మహాసముద్రంలో, సాధారణ పరిస్థితుల్లో, గాలులు భూమధ్యరేఖ ద్వారా పశ్చిమంగా వీస్తాయి అలా జరగడం వలన దక్షిణ అమెరికా నుండి వెచ్చని నీరు ఆసియా వైపు వస్తుంది. సముద్రపు లోతుల నుండి పైకి వచ్చే చల్లటి నీరు వెచ్చని నీటితో ప్రవహించే ఖాళీ స్థలాన్ని నింపుతుంది, అలాంటి ప్రాసెస్ ను అప్‌వెల్లింగ్ అంటారు. ఎల్ నినో సహా లా నినా ఈ పరిణామాన్ని నాశనం చేస్తాయి. మన భారతదేశానికి లా నినా ప్రభావంమంచి సూచన, అదే ఎల్ నినో ప్రభావం ఉంటే, జూన్ మరియు అక్టోబర్ మధ్య భారతదేశంలో రుతుపవనాలు ప్రభావితమవుతాయని అంటున్నారు. 


Also Read; Rangbhari Ekadashi 2023: 'రంగభరి ఏకాదశి' అంటే ఏంటి? ఆరోజు 'విష్ణుమూర్తిని' పూజిస్తే ఇక తిరుగే లేదు!


Also Read: Nothing Phone 2 Update: నధింగ్ ఫోన్ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చిన సీఈవో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి