What is New Wage Code, Salary Slips To Change From FY 2022-23 Know New Salary Structure and full details here : త్వరలో దేశంలో కొత్త వేతన నియమావళి అమలులోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో న్యూ వేజ్‌ కోడ్ (New Wage Code) అమల్లోకి రానుంది. కొత్త వేతన నియమావళి ఏప్రిల్ 2022 తర్వాత ఎప్పుడైనా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త వేతన నియమావళిని అమలుతో ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ (Salary Structure) పూర్తిగా మారిపోనుంది. శాలరీ స్లిప్స్ విధానం మారనుంది. పీఎఫ్​, (PF) గ్రాట్యుటీ, ఇతర కటింగ్స్‌లలో మార్పులు రానున్నాయి. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ (Take Home Salary) తగ్గుతుంది. బేసిక్ పే (Basic pay) పెంచడం వల్ల ఉద్యోగుల పీఎఫ్‌లో (Employees PF) ఎక్కువగా కట్ అవుతుంది.


కొత్త వేతన నియమావళి అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) లెక్కించే విధానంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్‌ శాలరీ తగ్గించి.. అలవెన్స్‌ల రూపంలో మిగతా మొత్తాన్ని ఇస్తున్నాయి. అయితే కొత్త వేతనాల కోడ్ ప్రకారం, ఉద్యోగి బేసిక్ శాలరీ 50 శాతం, (Employee Basic Salary) అలవెన్స్‌లు 50 శాతం ఉండేలా చూడనున్నారు. బేసిక్‌ శాలరీ మొత్తం జీతంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండనుంది. బేసిక్ జీతం (Basic salary) పెంపుతో పీఎఫ్, గ్రాట్యుటీ (Gratuity) మొత్తం పెరుగుతుంది. దీంతో ఉద్యోగులు టేక్‌ హోమ్‌ శాలరీ (Take Home Salary) తగ్గుతుంది. పీఎఫ్‌ వాటాలు పెరుగుతాయి. 


కొత్త వేతన కోడ్ చట్టం 2019 ప్రకారం... ఉద్యోగి ప్రాథమిక వేతనం (Employee basic salary) కంపెనీ ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం వరకు ఇది ఉంటోంది. మిగిలిన జీతం హెచ్‌ఆర్‌ఏ, (HRA) టెలిఫోన్ ఛార్జీలు, న్యూస్ పేపర్స్ మొదలైన అలవెన్సుల ద్వారా కవర్ అవుతాయి. అయితే కొత్త వేతన చట్టం ద్వారా బేసిక్ జీతం పెరుగుతున్నందున.. అలవెన్సులు (Allowances) తగ్గుతాయి.


ఉదాహరణకు.. ఒక ఉద్యోగికి ప్రస్తుతం నెలకు రూ. 1 లక్ష జీతం వస్తుంటే.. బేసిక్ శాలరీ రూ. 30,000-40,000 ఉంటుంది. మిగిలిన జీతం అలవెన్సుల రూపంలో వస్తుంది. కానీ కొత్త వేతన చట్టం ప్రకారం.. నెలకు రూ. 1 లక్ష జీతం వస్తే.. బేసిక్ శాలరీ కనీసం రూ. 50,000 ఉంటుంది. ఇక అలవెన్స్‌లు 50 శాతం పరిమితిలో ఉంటాయి.


కొత్త వేతన చట్టం ప్రకారం.. పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్‌) పెరగనుంది. టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది. పీఎఫ్‌ను (PF) కూడా బేసిక్‌ శాలరీలో ఒక శాతం ప్రకారం.. పరిగణలోకి తీసుకుంటారు. ఇక బేసిక్ శాలరీ పెరగడంతో పీఎఫ్ కటింగ్ కూడా పెరుగుతుంది. దీంతో పీఎఫ్ అమౌంట్ (PF Amount) పెరిగి ఉద్యోగుల భవిష్యత్తు మరింత భద్రంగా ఉండనుంది. అయితే దీనివల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. 


Also Read : ICC T20I New Rule: టీ20ల్లో కొత్త రూల్‌.. ఇకపై స్లో ఓవర్​రేట్​ వేస్తే ఓ ఫీల్డర్ ఔట్!


కొత్త నిబంధనల ప్రకారం.. హెచ్‌ఆర్‌ఏపై ట్యాక్స్ గణనీయంగా పెరుగుతుందని అంచనా. బేసిక్ శాలరీ పెరగడం వల్ల హెచ్‌ఆర్ఏ కూడా పెరుగుతుంది. పెరిగిన హెచ్‌ఆర్‌‌ఏ పార్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ఎక్కువ శాలరీ తీసుకునే ఉద్యోగులపై (employees) ఈ ప్రభావం పడనుంది.


Also Read : Stock Market today: వారాంతంలో స్టాక్ మార్కెట్లకు లాభాలు- 59,700పైకి సెన్సెక్స్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి