Seat Belt Devices: అమెజాన్‌లో ఆ చిన్న పరికరాల అమ్మకాన్ని నిషేధించాలనే డిమాండ్. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ. రెండింటికీ సంబంధమేంటని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొన్న ఆదివారం నాడు టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. ఆ తరువాత అమెజాన్ వేదికలో ఆ చిన్న చిన్న పరికరాల అమ్మకాన్ని నిషేధించాలనే డిమాండ్ ప్రారంభమైంది. అది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోటి నుంచి. రెండింటికీ సంబంధమేంటనే కదా మీ సందేహం..


సైరస్ మిస్త్రీ మరణానికి..ఆ పరికరాలకు సంబంధమేంటి


జాతీయ రహదారులు రవాణా శాఖ..కన్జ్యూమర్స్ మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాసింది. అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికల్లో సీట్ బెల్ట్ అలార్మ్‌‌ను బ్లాక్ చేసే చిన్న చిన్న ఉపకరణాల అమ్మకాన్ని నిషేధించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కార్లలో సీటు బెల్ట్ పెట్టుకోనప్పుడు అలార్మ్ వస్తుంటుంది. ఆ అలార్మ్‌ను బ్లాక్ చేసే చిన్న చిన్న పరికరాలు ఈ కామర్స్‌లో విరివిగా లభిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఈ కామర్స్ కంపెనీలకు నోటీసులు కూడా అందినట్టు తెలుస్తోంది. 


నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని సైరస్ మిస్త్రీ మరణం తరువాత చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ప్రమాద సమయంలో సైరస్ మిస్త్రీ కూడా వెనుక సీట్లో బెల్ట్ పెట్టుకోకుండా కూర్చుని ఉన్నారు. సీట్ బెల్ట్ అలార్మ్ మోగకుండా అ పరికరం అమర్చారా అనే సందేహాలు వస్తున్నాయి.


Also read: Amit Shah: మొన్న ప్రధాని మోదీ..నిన్న హోంమంత్రి అమిత్‌షా..నేతల టూర్‌ల్లో భద్రతా వైఫల్యాలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook