WhatsApp privacy policy deadline: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే వాట్సాప్ ఎకౌంట్స్ డిలీట్.. ఢిల్లీ హై కోర్టుకు వాట్సాప్
WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు.
WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీని వాయిదా వేసే ప్రసక్తే లేదని, ఒకవేళ ఎవరైనా వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరించనట్టయితే వారి వాట్సాప్ ఖాతాలను దశలవారీగా తొలగించనున్నట్టు వాట్సాప్ తేల్చిచెప్పింది.
కేంద్రం తరపున ఢిల్లీ హై కోర్టులో వాదనలు వినిపించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాట్సాప్ పిటిషన్‌పై స్పందిస్తూ.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ వాట్సాప్ సీఈఓకు కేంద్రం ఓ లేఖ రాసిందని, సీఈఓ నుంచి రిప్లై కోసం వేచిచూస్తున్నామని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు.
Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ?ఈ విషయం తెలుసా
అయితే వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఐటి యాక్టు 2000 నాటి చట్టాన్ని (Information Technology Act, 2000) ఉల్లంఘిస్తోంది అనే ఆరోపణలపై వాట్సాప్ తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ సహ న్యాయవాది అర్వింద్ దతర్ ఖండించారు. అన్ని ఐటి రూల్స్ అనుసరించే వాట్సాప్ ప్రైవసీ పాలసీ (WhatsApp privacy policy) రూపొందించడం జరిగింది అని అర్వింద్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో ఇరువురి వాదనలు విన్న ఢిల్లీ హై కోర్టు.. పిటిషన్ విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.
Also read : EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook