ప్రపంచ ధనికుల్లో ఒకరైన ముఖేష్ అంబాని తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానికి పెళ్లి చేస్తున్నాడట అనే వార్త బయటికి రాగానే అందరికి ముందుగా వచ్చిన సందేహం ఒక్కటే. ఆకాశ్ అంబాని లాంటి ధనికుడిని ఆకట్టుకున్న ఆ అందగత్తె ఎవరు ? ఏ వ్యాపారవేత్త కూతురు ? ఎన్ని బిలియన్ కోట్లకు వారసురాలు ? అసలు ఆకాశ్ అంబానికి, ఆమెకి మధ్య పరిచయం ఏంటి ? ఈ పెళ్లి కుదిర్చిన పెద్దలు ఎవరు అనే ఆలోచనలే అందరినీ చుట్టుముట్టాయి ? అయితే, ఆకాశ్ అంబాని పెళ్లి చేసుకోబోతున్న ఆ వధువు గురించి చాలామందికి కలుగుతున్న సందేహాలకు క్లుప్తమైన సమాధానమే ఈ చిన్న స్టోరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ శ్లోకా మెహతా నేపథ్యం ఏంటి ? 
అంబాని ఇంటికి పెద్ద కొడలిగా రానున్న శ్లోకా మెహతా నేపథ్యం ఏంటి ? ఆమె ప్రొఫైల్ ఏంటనేదానిపైనే ప్రస్తుతం ఆసక్తికపైమన చర్చలు జరుగుతున్నాయి. అయితే, శ్లోకా నేపథ్యం విషయానికొస్తే, రస్సెల్ మెహతా చిన్న కూతురైన శ్లోకా ప్రస్తుతం రస్సెల్ మెహతా నిర్వహిస్తోన్న రోజీ బ్లూ డైమండ్స్‌కి డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 


ఆకాష్‌కి శ్లోకాకు పరిచయం ఎలా జరిగింది ?
ఆకాష్ అంబాని, శ్లోకా ఇద్దరు ధీరూభాయ్ అంబాని ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే కలిసి చదువుకున్నారు. అనంతరం న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి ఆంత్రపాలజీ విద్యను అభ్యసించిన శ్లోకా ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ నుంచి న్యాయవిద్యలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. 


అన్నింటికిమించి అంబానికి, వజ్రాల వ్యాపారి మెహతా కుటుంబాల మధ్య దశాబ్ధాల కాలం నుంచి స్నేహం వుంది. ఇదేకాకుండా స్కూల్ రోజుల నుంచే కలిసి చదువుకున్న ఆకాశ్ అంబాని, శ్లోకా అంబానిల మధ్య మంచి స్నేహం వుంది. అలా కుదిరిన ఆ స్నేహమే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒక్కటి చేసేందుకు కారణమైందని తెలుస్తోంది.