హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ దుమాల్ ఎన్నికల్లో పరాజయం పొందాక.. పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నిక చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ అవకాశం సీనియర్ బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్‌ని వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లోని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై పార్టీ ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుదనే సమాచారం వెలువడడంతో.. ఇప్పుడు హిమాచల్ బీజేపీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సీఎం పోటీ రేసులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హిమాచల్ సీఎం విషయంలో ఒక నిర్ణయానికి రావడం కోసం.. రాష్ట్ర బీజేపీ నాయకులతో చర్చలు జరపడం కోసం కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఈ రోజు సిమ్లాకి రానున్నారు. ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు సేకరించాక మాత్రమే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు.


ప్రస్తుతం ఎక్కువ అంచనాలు జైరాం ఠాకూర్ మీదే ఉన్నాయనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ స్తున్నాయి. ఠాకూర్ గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఠాకూర్ మాత్రమే కాక ప్రేమ్ కుమార్ దుమాల్ కుమారుడు అనురాగ్ ఠాకూర్‌, మాజీ మంత్రి సుఖ్‌రామ్ కుమారుడు అనిల్ శర్మ కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.