ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. చంద్రయాన్ 3 విజయం, ఆదిత్య ఎల్ 1 లతో ఇస్రో ఖ్యాతి మరింతగా పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇస్రో సాధించిన, సాధిస్తున్న విజయాలు అటువంటివి. అయినా సరే..ఇస్రోలో మేం చేరమంటున్నారు భావి భారత ఇంజనీర్లు. ఎందుకీ పరిస్థితి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మాటలు ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చెప్పిన మాటలివి. ఇస్రోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఖ్యాతి ఉన్నా, సక్సెస్ రేట్ ఎంత ఉన్నా సరే ప్రతిభావంతులైన ఇంజనీర్లు మాత్రం ఇస్రోలో చేరేందుకు నో అంటున్నారని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్ని సైతం ఆకర్షించే దేశంలోని ఐఐటీల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు ఇస్రోలో చేరేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. కారణం జీతభత్యాలే అంటే నమ్మక తప్పదు మరి. నాసాలో చేరేందుకు ఇష్టపడే ఐఐటీయన్లు ఇస్రో అంటే వెనుకంజ వేస్తుంటారు. 


ఐఐటీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 60 శాతం విద్యార్ధులు ఇస్రో అందించే గరిష్ట జీతం తెలుసుకున్నాక డ్రాప్ అయిపోతున్నారని డాక్టర్ సోమనాథ్ వివరించారు. ఇదేదో అలవోకగా చెబుతున్నది కాదు. నిజంగా జరిగిందే. ఇటీవల ఛీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకునేందుకు ఓ ఐఐటీ క్యాంపస్‌కు వెళ్లిన ఇస్రో టీమ్‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. ఇస్రోలో చేరకపోవడానికి ప్రధాన కారణం జీతభత్యాలు తక్కువగా ఉండటమే. అదే సమయంలో అంతరిక్షాన్ని ఓ అవసరమైన రంగంగా భావించేవారులే 1 శాతమే ఇస్రోపై ఆసక్తి చూపిస్తున్నారట. 


ఇస్రోలో జీతాలు తక్కువగా ఉన్నాయనే సంగతి కొత్తగా తెలిసింది కానేకాదు. ఎప్పట్నించో ఉన్నదే. ప్రపంచాన్ని గర్వించే స్థాయికి తీసుకెళ్తున్నా ఇస్రో జీతాల బడ్జెట్ మాత్రం చాలా తక్కువ. అంతెందుకు ఇస్రో ఛైర్మన్ సోమనాథన్ తీసుకునే జీతం 2.5 లక్షలే. ఆయన స్థాయికి ఆ జీతం చాలా చాలా తక్కువ. ఇస్రోలో ప్రారంభ వేతనం కేవలం 56 వేలు మాత్రమే అంటే నమ్మక తప్పదు. ఇటీవలి కాలంలో న్యూస్ వెబ్‌సైట్స్ కంటెంట్ రైటర్స్‌కు అంతకంటే ఎక్కువే చెల్లిస్తున్నారు. 


జీతభత్యాల కారణంగా ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఇస్రోలో చేరడం లేదు. ఇది ఇస్రోకు అత్యంత సవాలుగా మారింది. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేయాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ అదే సమయంలో జీతభత్యాలు తక్కువగా ఉండటంతో వెనుకంజ వేసే పరిస్థితి ఉంటోంది. 


Also read: Akhilesh Yadav Climbs Boundary Wall: గోడ దూకిన మాజీ సీఎం.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook