కుమారస్వామి భార్య గురించి తెగ వెతికేస్తున్నారు!
జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో ఆయన భార్య రాధికా కుమారస్వామి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో ఆయన భార్య రాధికా కుమారస్వామి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమెకు సంబంధించిన వార్తలు గూగుల్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? లాంటివాటిని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
రాధికా కుమారస్వామి కన్నడనాట ప్రముఖ నటి. ప్రొడ్యూసర్‌గానూ ఉన్నారు. రాధికా మంగళూరులో 1986లో జన్మించారు. ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటించారు. 2000 ప్రారంభంలో కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ప్రధాన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రాధిక 2000లో రతన్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. 2002లో రతన్ మరణించారు.
కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసిన సమయంలో 2005లో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నిజానికి కుమారస్వామికి కూడా ఇది రెండో వివాహం. కుమారస్వామి 1986లో అనితను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ నిఖిల్‌గౌడ అనే కుమారుడున్నాడు.
2006లో కుమారస్వామి, రాధికా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ 2010లో తమ వివాహం గురించి రాధికా అధికారికంగా వెల్లడించారు. వీరిద్దరికీ షమికా అనే కుమార్తె ఉంది. రాధిక ఇంతవరకూ 32 సినిమాల్లో నటించారు. తమిళ సినిమాల్లోనూ రాధిక ప్రతిభ చూపారు. ప్రస్తుతం రాధికా కుమారస్వామి సినిమా నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కుమారస్వామికి 58 ఏళ్లు, అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. తెలుగులో భద్రాది రాముడు(2004), అవతారం(2014) చిత్రాల్లో నటించారు.