కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ క్షమాపణలు చెప్పారు. జనక్‌పూర్‌ పర్యటనలో లక్షలాది మంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారని ఆమె ఓ ప్రెస్‌ మీట్‌లో పేర్కొనగా.. అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమె స్పందించారు. ‘ఇది నా తప్పే. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమంలో సుష్మా ప్రధానిపై ప్రశంసలు గుప్పించారు. ‘అమెరికాలోని మాడిసన్‌ స్క్వేర్‌ మొదలు.. నేపాల్‌లోని జనక్‌పూర్‌ వరకు లక్షలాది మంది భారతీయులను కలుసుకొని, వారిని ఉద్దేశించి మన ప్రధాని మోదీ ప్రసంగించారు’ అని సుష్మా పేర్కొన్నారు.



 


ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘విదేశాంగశాఖ మంత్రి గారి దృష్టిలో జనక్‌పూర్‌లో మొత్తం భారతీయులే కనిపిస్తున్నారు కాబోలు..' అంటూ ఒకరు, 'సుష్మాజీ వాళ్లు నేపాలీలు.. భారతీయులు కారు’ అంటూ మరొకరు కామెంట్లు చేశారు. సుష్మా స్వరాజ్  వ్యాఖ్యలపై నేపాల్‌ ఎంపీ గగన్‌ కూడా అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె క్షమాపణలు చెప్పారు.