28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బాబ్రీ మసీదు తీర్పు ( Babri masjid verdict ) వెలువడింది. ప్రతిపక్షాలకు చుక్కెదురైంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్న నేపధ్యంలో బాబ్రీ తీర్పు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకు కచ్చితంగా లాభించే అంశంగా మారనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ( Babri masjid Demolition case ) లో వెలువడిన తీర్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ రేగుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా..తీర్పు మాత్రం బీజేపీ ( BJP ) లో కొత్త ఉత్సాహాన్ని రేపుతోంది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ( LK Advani ) సహా 32 మందిపై సీబీఐ మోపిన అభియోగాల్ని సీబీఐ ప్రత్యేక కోర్టు ( CBI Court ) కొట్టివేసింది.కేసులో నిందితులంతా నిర్దోషులేనని...మసీదు విధ్వంసంలో కుట్ర ఉందనడానికి ఆదారాల్లేవని స్పష్టం చేసింది. దీంతో 28 ఏళ్లుగా ఈ నిందను మోస్తున్న బీజేపీ నేతలకు ఊరట లభించింది. 


దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా బీహార్ లో ఎన్నికలు ( Bihar Elections ) నవంబర్ లో జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్ ( Madhya pradesh ) లోని 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరో ఏడాదిన్నర వ్యవధిలో పంజాబ్ తో పాటు పశ్చిమ బెంగాల్ ( West Bengal Assembly Elections ) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. బాబ్రీ మసీదు తీర్పులో బీజేపీ నేతలంతా నిర్దోషులుగా తీర్పు వెలువడటంతో కచ్చితంగా ఈ అంశం రానున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీకు ఓ ప్రచారాస్త్రంగా ( Election campaign ) ఉపయోగపడనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ  ఆదిత్యనాధ్ ( UP CM yogi Adityanadh ) దీనికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు  ఉదాహరణ. తీర్పు నేపధ్యంలో కుట్రదారులంతా ఇప్పుడు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబ్రీ తీర్పు నేపధ్యంలో బీజేపీ నేతలపై మైనార్టీల్లో ఉన్న అపోహ తొలగిపోతుందనేది విశ్లేషకుల భావన.


బీహార్ లో ఇప్పటికే జేడీయూ ( JDU ) తో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీ ఆ రాష్ట్రంలో బలం పంజుకోవాలని చూస్తోంది. అటు పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని చూస్తోంది. వాస్తవానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ లో బాగా పుంజుకుంటోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకు ఏకంగా 18 ఎంపీ స్థానాలు రావడం చిన్న విషయమేమీ కాదు.  


ఈ తరుణంలో బాబ్రీ మసీదు తీర్పు రావడంతో దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో కచ్చితంగా రాజకీయంగా ఆ పార్టీకు ఇది లాభించే అంశమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే బాబ్రీ తీర్పును ప్రచారాస్త్రంగా మల్చుకోనుంది బీజేపీ. Also read: Babri Demolition: బాబ్రీతీర్పు అనంతరం న్యాయమూర్తి పదవీ విరమణ..కారణం?