Covid Third Wave : కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే నదులు మళ్లీ మృతదేహాల డంప్ యార్డ్లు అవుతాయా?
Covid Third Wave - rivers become dumping ground for dead : ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైంది. కోవిడ్ థర్డ్ వేవ్‌తో డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Will the rivers become dumping ground for dead again when the Covid Third Wave comes? కోవిడ్ సెకెండ్ వేవ్‌ను ఎవరూ మరిచిపోలేరు. అప్పటి విషాద ఘటనలు గుర్తుకొస్తే భయం వేస్తుంది. కోవిడ్‌తో మృతి చెందిన వారిని సరిగ్గా దహనం చేసే పరిస్థితులు కూడా ఉండేవి కావు. ఆత్మీయులు ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లే పరిస్థితి కూడా ఉండేది కాదు.
తాజాగా క్లీన్ గంగ (Clean Ganga) జాతీయ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా రాసిన గంగ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా
ఆయన పలు విషయాలు వెల్లడించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో గంగానది, అలాగే దాని ఉపనదులలో మూడువందలకు పైగా సగం కాలిన శవాలు, కుళ్లిన మృతదేహాలు (Dead bodies) కొట్టుకొచ్చాయన్నారు. పవిత్రమైన గంగానది ఇలా డంపింగ్ యార్డ్‌గా (Dumping yard) మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజీవ్ రంజన్ మిశ్రా (Rajiv Ranjan Mishra).
కోవిడ్ సెకెండ్ వేవ్ (Covid Second Wave) సమయంలో దేశంలో సరిపడా బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల చాలా మంది కరోనా బారినపడి మృతి చెందారు. అయితే యూపీ, బిహార్‌లలో కోవిడ్‌తో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారాలు నిర్వహించాలో తెలియక.. అక్కడి అధికార యంత్రాంగాలు మృతదేహాలను (Dead bodies) డంపింగ్ చేసేందుకు గంగానదిని ఎంచుకున్నాయి. అలాగే కోవిడ్‌తో మృతి చెందిన వారిని ఖననం చేసే విధానంపై అవగాహన లేక కొందరు మృతదేహాలను గంగానదిలో వేసేశారు. ఆర్థిక పరిస్థితులు బాగలేక కూడా కొందరు ఇలాంటి విధానమే ఆచరించారు.
కరోనా భయాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఆ మహమ్మారి ఇంకా మనల్ని పూర్తిగా వదిలి పోలేదు. ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ (Covid Third Wave) మొదలైంది. ఇప్పుడు కూడా మళ్లీ కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఏర్పడ్డ ఇబ్బందులే తలెత్తే అవకాశం ఉందంటూ జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటితో పాటు భారత్‌ను కూడా హడలెత్తిస్తోంది. ఇప్పటికే భారత్‌ను రెండు వేవ్స్ (Two waves) కుదిపేశాయి. ఒమిక్రాన్‌తో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ నిపుణులు హెచ్చిస్తున్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే లక్షల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మనదేశంలో 17 రాష్ట్రాలకు ఒమిక్రాన్ పాకింది. దేశంలో 415కు పైగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు (Omicron cases) భారీగా నమోదు అవుతున్నాయి.
Also Read : Muzaffarnagar Rape: ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ ద్వారా మనదేశంలో ఎవరూ మృతి చెందలేదు. ఒకవేళ మళ్లీ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చి డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగానదితో (Ganga river) పాటు దేశంలోని ఇతర నదులు మృతదేహాల డంప్ యార్డ్‌లుగా మారుతాయోమోనని భయాందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. దేశంలో థర్డ్ వేవ్ (Third wave) విజృంభించకుండా ఉండేందుకు చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది.
Also Read : Farm Laws: 'ఎవరూ చేయలేని పనిని మోదీ చేశారు.. సాగు చట్టాలు మళ్లీ తెస్తాం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి