Scary Video: అకస్మాత్తుగా క్రూరమృగం కళ్లెదుటకి వస్తే ఏం చేస్తాము..?? వెన్నులో వనుకుపుట్టి... పరిగెత్తటం లేదా అక్కడే గుండె ఆగిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఒక వృద్దురాలు.. చేతి కర్ర సాయం లేనిదే నడవలేని స్థితి. మాములుగా ఉన్నవారే చిరుతను చూసి భయపడతారు. అకస్మాత్తుగా చిరుత దాడి (Leopard Attack) చేసిన ఆ వృద్దురాలు దైర్యంగా చేతి కర్రతోనే పోరాడి ఆ చిరుతను తరిమేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతుం ఇంటర్నెట్ లో ఒక వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతుంది. ఈ ఘటన ముంబాయిలోని (Mumbai) ఆరే అనే కాలనీ (Aarey Colony) లో జరిగింది. అక్కడ నివసించే నిర్మలాదేవీ సింగ్ (Nirmaladevi Rambadan Singh) అనే మహిళ వృద్దురాలు.. చేతి కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి.


Also Read: Tollywood Anuradha Suicide: ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ యువనటి.. కుళ్లిన మృతదేహం


రాత్రి ఆమె చేతి కర్ర పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆరు భయాట కూర్చింది. ఇది వరకే గేటు దగ్గర ఎదురుచూస్తున్న చిరుతను నిర్మలాదేవీ గుర్తించలేదు. అక్కడే కూర్చొని ఉన్న నిర్మాలాదేవి అటు ఇటు చూస్తుండగా.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న చిరుత నెమ్మదిగా వచ్చి ఆమెపై దాడి చేసింది....




నిర్మలాదేవీకి ఎదో పక్కన కదులుతున్నట్టు అనిపించగానే పక్కకి చూడగానే చిరుత ఆమెపై దాడి చేయటం ప్రారంభించింది. అంతే విషయం అర్థమైన నిర్మలాదేవీ వెంటనే చేతి కర్రను  (Walking Stick) తీసుకొని చిరుతను నిలువరించే సమయంలో ఆమె కింద పడిపోయింది. అయిన కూడా చేతిలో ఉన్న కర్రతో చిరుతను తీవ్రంగా ప్రతిఘటించింది.  


Also Read: Breaking news: పోసాని ఇంటిపై రాళ్లదాడి..అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు


ఆమె అరుపులకు ఇంట్లో వాళ్లు భయటకి వచ్చేలోపే చిరుత అక్కడి నుండి పారిపోయింది. స్వల్పంగా గాయపడిన నిర్మలాదేవీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్ అవ్వగా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అది కాస్త వైరల్ అవ్వగా నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. 


ముంబాయిలోని ఆరే కాలనీ చుట్టూ అడవి ప్రాంతం ఉండగా.. గడచిన మూడు రోజులలో చిరుత దాడి జరగటం ఇది రెండవ సారి. రెండు రోజుల కింద ఒక నాలుగేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా.. చిరుత అతడిపై దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తం అవగా బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ తరహా క్రూర మృగాల దాడి ఇది వరకు కూడా ఈ కాలనీలో జరిగాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి