హైదరాబాద్: ప్రమాదవశాత్తుగా రైలు కింద పడపోయిన ఓ మహిళను అక్కడే వున్న రైల్పే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది ప్రవీణ్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ పొరపాటున కాలుజారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కి మధ్యలో పడిపోయారు. అది గమనించిన ప్రవీణ్ కుమార్ ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు వెళ్లి గట్టిగా చేయిపట్టి వెనక్కి లాగడంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. మలాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.