Woman throws her six year old son into crocodile infected river in karnataka: చాలా మంది మహిళలు పెళ్లయిన తర్వాత తల్లి కావాలని కోరుకుంటారు. తొమ్మిదినెలలో పాటు తమ కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అంతేకాకుండా.. తమ ఆరోగ్యంతో పాటు,కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి కూడా తెగ తాపత్రయపడిపోతుంటారు. కొందరు  మహిళలు మాత్రం తమ  శరీరంలో అనారోగ్య సమస్యల వల్ల తొందరగా కన్సీవ్ అవ్వరు. దీంతో అనేక ఆస్పత్రుల చుట్టు తిరుతుంటారు. కనపడిన గుళ్లు, గోపురాల చుట్టు తిరుగుతుంటారు. ఎలాగైన అమ్మ అని తమ బిడ్డతో పిలిపించుకోవాలని కోరుకుంటారు. దీని కోసం ఎన్నిరకాల ట్రీట్మెంట్ అయిన చేసుకుంటారు. డబ్బులు ఎంత ఖర్చుచేయడానికి సైతం వెనుకాడరు. కొందరుపిల్లలు పుట్టరని తెలిస్తే తమ బంధువులు లేదా అనాథాశ్రమాల నుంచి పిల్లలను తెచ్చుకొని మరీ పెంచుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?


ఇక పిల్లలు పుట్టాక తల్లులు తమ బిడ్డలను కంటికి రెప్పలా చేసుకుంటారు. ఒక నిముషం కూడా వదిలి పెట్టి ఉండరు. ఏపని చేస్తున్న కూడా ఒక  కన్ను తమ బిడ్డమీద వేసి ఉంచుతారు. కానీ మరికొందరు మహిళలు మాత్రం ఆడతనానికి, అమ్మతానానికి మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. పెళ్లికాకుండా ప్రెగ్నెంట్ అయి,పుట్టిన బిడ్డలను చెత్తకుప్పలలో పడేస్తుంటారు. కొందరు అబార్షన్ లు చేసుకుంటారు.పొత్తిళ్లలో తమ పిల్లలను చంపుకొవడానికి సైతం వెనుకాడరు. అచ్చం ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


 
కర్ణాటకలోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇళ్లలో పని చేసే 32 ఏళ్ల సావిత్రి తన భర్త రవికుమార్ తో ఉండేది. వీరికి ఇద్దరు కుమారులు. ఒక బిడ్డ పుట్టుకతో  చెవిటి, మూగవాడు. మరో రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మొదటి కొడుకు విషయంలో దంపతులు తరచుగా గొడవలు పడేవారు. తాపీ మేస్త్రీగా పనిచేసే రవి తనకోడుకునే పదే పదే వెక్కిరించేవాడని, తమ కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదించేవాడని భార్య సావిత్ర చెప్పింది. శనివారం కూడా ఇలాంటి గొడవ జరగడంతో సావిత్రి తన కుమారుడిని ఉత్తర కన్నడ జిల్లాలోని కాలువ వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేసింది. ఆ నీటిలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయి. ఆ చెరువులో మూగవాడైన కొడుకును విసిరేసి మహిళ ఇంటికి వచ్చేసింది.


Read More: Sunita Williams: గణపతి ప్రతిమను తీసుకెళ్తా.. మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌..


ఇరుగు పొరుగు వారు ఆరాతీయగా జరిగిన దారుణాన్ని చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే చీకటి అయిపోయింది. ఉదయాన్నే పోలీసులు నీళ్లలో వెతుకగా బాలుడి శవం బైటపడింది. దాని మీద మొసళ్లు, చేపల గాట్లు కన్పించాయి. పోలీసులు బాడీనిపోస్ట్ మార్టంకు తరించారు. మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసి అరెస్టుచేశారు. తన భర్త టార్చర్ వల్లనే కోపంలో ఇలా చేసినట్లు మహిళ అంగీకరించింది. ఒక కొడుకును చేతులారా చంపుకోవడం, ఇద్దరు అరెస్టు కావడం వల్ల మరో బిడ్డ ప్రస్తుతం అనాథలా మారిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. మూగ, చెవిటి బిడ్డను మొసళ్లతో ఉన్న నీళ్లలో విసిరేయడం ఏంటని స్థానికులు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter