నాకు నాపిల్లల్లే స్ఫూర్తి : చందా కొచ్చర్
బుధవారం చందా కొచ్చర్ రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. `మహిళా సాధికారత` పై జరిగిన ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమంలో ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ పాల్గొన్నారు.
బుధవారం చందా కొచ్చర్ రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. 'మహిళా సాధికారత' పై జరిగిన ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమంలో ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ చర్చలో ఇవాంకా, చెర్రీ బ్లెయిర్, కారెన్ క్యూన్టోస్ కూడా పాల్గొన్నారు. విశేషమేమిటంటే ఈ చర్చ కు సమన్వయ కర్తగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
చందా కొచ్చర్ చర్చలో మాట్లాడిన హై లెట్ పాయింట్స్ ఇవే:
* బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మహిళలు కెరీర్ ను వదులు కుంటున్నారు. ఆ సమయంలో కెరీర్ ను వదులుకొనే ఆలోచన చేయవద్దు.
* మహిళల్లో ఆత్మస్థైర్యం నింపినప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళగలం.
* మహిళలు పెద్దలను, పిల్లలను చోసుకుంటూనే ఇంటివద్ద నుంచే పని చేయవచ్చు. సాంకేతికతను వినియోగించుకుంటే ఇది సాధ్యం
* మహిళల్లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అవసరం... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో
* విద్యా, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఎదుగుతారు
* నాకు నా పిల్లల్లే స్ఫూర్తి
*భారత్ లో మహిళా భాగస్వామ్యం పెరిగింది. బ్యాంకింగ్ లో 40% మహిళలు ఉన్నారు.
*రక్షణ, క్రీడా రంగంలో మహిళలు రాణించడం చాలా ఆనందంగా ఉంది.
* 7-8 ఏళ్లలో భారత్ జీడీపీ 700 బిలియన్ డాలర్లకు చేరుకోబోతుంది.