జైల్లో డేరా బాబా దుర్భర జీవితం
రోహ్ తక్ జైలులో డేరా బాబా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. గుర్మీత్ జైలు జీవితంపై జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ వివరించారు. ఆయన రోజూ 8 గంటల శ్రమకు కూలి 20 రూపాయలు ఇస్తున్నారట. గుర్మీత్ జైలులో సాధారణ ఖైదీగానే ఉన్నారని తెలిపారు. ఆయన సెల్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఆయన దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయనకు కనీసం టీవీ, పత్రికలు కూడా అందుబాటులో లేవని, ఫోన్ సౌకర్యం కూడా కల్పించలేదని ఆయన చెప్పారు. జైలులో గుర్మీత్ కు నైపుణ్యం లేని వృత్తిని అప్పగించామని చెప్పారు. దీంతో గుర్మీత్ రోజూ 8 గంటల పాటు కూరగాయలు, ఎండు ద్రాక్ష తోటల్లో పని చేస్తున్నారని చెప్పారు. నైపుణ్యం లేని కూలీలకు జైళ్లలో వేతనం 20 రూపాయలని ఆయన తెలిపారు. గుర్మీత్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్న దాంట్లో వాస్తవం లేదని జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ స్పష్టం చేశారు.