Akhilesh Yadav: వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను..అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
Akhilesh Yadav 2022 Uttar Pradesh assembly polls:ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు.
Won’t be contesting 2022 Uttar Pradesh assembly polls, says Akhilesh Yadav: Report: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ (Samajwadi Party (SP) chief Akhilesh Yadav) ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి (Chief Minister of Uttar Pradesh) బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక అఖిలేశ్ యాదవ్ పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను (Muhammad Ali Jinnah) సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. తాజాగా హర్దోయ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు. సర్దార్ పటేల్, (Sardar Vallabhbhai Patel) మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులయ్యారని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో వారు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. అప్పట్లో రైతుల కోసం పోరాడినందుకే పటేల్‌కు సర్దార్ (Sardar) బిరుదు వచ్చిందని.. మరి ఆయన బాటలో పయనిస్తున్నామని చెప్పుకునే బీజేపీ (BJP) నేడు రైతులను ఏడిపిస్తోందంటూ తప్పుబట్టారు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav).
Also Read : Australia Covaxin Approval: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక గుర్తింపు
ఇక గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు.. బాబా ముఖ్యమంత్రి అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్‌పై (UP Chief Minister Yogi Adityanath) అఖిలేష్ మండిపడ్డారు.
అయితే ఈ కామెంట్స్‌పై యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ (Taliban) మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని.. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి (Yogi Adityanath)పేర్కొన్నారు.
Also Read : Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. పడగ విప్పిన పాముకు ముద్దు.. వహ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి