న్యూ ఢిల్లీ: లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయడం బాగుంది కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటి ? కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంట్లోంచి బయటికి వెళ్తే.. కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా ? ప్రస్తుతం చాలామంది ఐటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే, సరిగ్గా అటువంటి వారి కోసమే అన్నట్టుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Law Minister Ravi Shankar Prasad on Tuesday) కూడా ఇవాళ ఓ తీపి కబురు చెప్పారు. ఐటి కంపెనీలకు సేవలు అందించే ఐటి ఉద్యోగులకు (IT professionals) వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని జూలై 31 వరకు పొడిగించనున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. తాజాగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఐటి కంపెనీలకు సంబంధించినంత వరకు 85% పని ఇంట్లో నుంచే పూర్తవుతోంది'' అని అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఆస్పత్రిలో 77 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్


కేంద్రం తొలుత చేసిన ప్రకటన ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏప్రిల్ 30న ముగియాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని ముగించేందుకు వీలు లేకపోవడంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు రాష్ట్రాల ఐటి శాఖల మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిపై వారితో చర్చించి, సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ విషయంలో ఇప్పటికే అన్ని నిబంధనలను సరళతరం చేసినట్టు మంత్రి చెప్పారు.


Also read : సమంత మజిలీ (Happy birthday Samantha Akkineni) 


అన్ని రాష్ట్రాల మంత్రులతో మాట్లాడే క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం సుషీల్ మోదీ ఓ సూచన చేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు, వారి అభిప్రాయాలను ఒకే వేదికపై పంచుకునేలా ఓ మొబైల్ యాప్ రూపొందిస్తే బాగుంటుందని సుషీల్ మోదీ కోరారని.. ఆయన సూచన మేరకు నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NEGD), నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)ని మొబైల్ యాప్ తయారీపై దృష్టిసారించాల్సిందిగా కోరడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..