World Cup 2023: వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మెగా టోర్నీ మరి కొన్ని గంటల్లో మన దేశంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 గురువారం రోజున అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.  క్రికెట్ అభిమానులు ఈ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఇదే క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్ ప్రారంభానికి, ఆటగాళ్లకు తలనొప్పికి ఏంటి అని అనుకుంటున్నారా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును.. వరల్డ్ కప్ లో భాగంగా ఆటగాళ్ల సన్నిహితులు, స్నేహితులు టికెట్ల గురించి వారిని ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. చాలా మంది క్రికెటర్లకు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి మన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సున్నితంగా తిరస్కరిస్తూ.. పోస్ట్ పెట్టాడు. 


ఈ విషయం గురించి విరాట్ కోహ్లీ తన స్నేహితులకు, సన్నిహితులకు సోషల్ మీడియా వేదికగా సూచన ఇచ్చారు. ప్రపంచకప్‌ 2023కి సంబందించిన టికెట్లు తనను అడగొద్దని పోస్ట్ లో తెలిపారు. విరాట్ తన పోస్ట్ లో "వన్డే ప్రపంచ కప్ సమరానికి సమయం ఆసన్నమైంది.. టోర్నీ పూర్తయ్యే వరకు ఎవడు నన్ను టికెట్లు అడగొద్దని మిత్రులందరికీ అభ్యర్థిస్తున్న.. మ్యాచ్ లను ఇంట్లోనే ఎంజాయ్ చేయండి" అని తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నాడు.   




Also Read: Sikkim Cloud Burst: ఘోర విషాదం..వరదల్లో 23 మంది ఆర్మీ జవాన్ల గల్లంతు..


2011 సంవత్సరంలో భారతదేశం ప్రపంచకప్ వేదిక అయింది. మళ్లీ 12 సంవత్సరాల తరువాత భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. 2011లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సారథ్యంలో భారత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ సారి రోహిత్ సారథ్యంలో జట్టు బలంగా ఉండటంతో సొంత గడ్డపై ట్రోఫీని సొంతం చేసుకోవాలి చూస్తుంది. 


అక్టోబర్ 5 న ప్రారంభం కానున్న మెగా టోర్నీ నవంబర్ 19 వరకు జరగనున్నాయి. అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. భారత్ అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్ తో..  అక్టోబర్ 14న పాకిస్తాన్ తో తలపడనుంది. 


Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. త్వరలోనే ప్రకటన..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook