ఢిల్లీ :  సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి వై.సీ.మోదీని జాతీయ దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టరు జనరల్‌గా కేంద్ర క్యాబినెట్ నియామకాల సంఘం ప్రకటించింది. మోదీ 2002 గుజరాత్ అల్లర్ల కేసును విచారిస్తున్న కమిటీలో సభ్యునిగా ఉన్నారు.


ఉగ్రవాద ప్రభావం ఉండి, దేశ రక్షణకు భంగం కలిగించే నేరాలను దర్యాప్తు చేసి సంస్థ అయిన ఎన్.ఐ.ఏకు ప్రస్తుతం శరద్ కుమార్ అధిపతిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం అక్టోబరు 30న ముగిశాక, తన చోటులో మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మే 2021 వరకు ఉంటుంది.1984 బ్యాచ్, అసోం - మేఘాలయా ఐ.ఏ.ఎస్ క్యాడరుకు చెందిన మోదీ ప్రస్తుతం సీబీఐలో ప్రత్యేక అధికారిగా ఉన్నారు.