అలహాబాద్: అలహాబాద్‌లో సబ్సిడీ కింద 10 రూపాయిలకే భోజనం అందించనున్నారు. దీనికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర ‘యోగి థాలి’ అని పేరు పెట్టారు. అలహాబాద్‌ మేయర్‌ అభిలాషా గుప్తా ఆదివారం సాయంత్రం 'థాలి'ని ప్రారంభించారు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సహచరులతో కలిసి ఈ థాలీని ఏర్పాటు చేయడం అభినందనీయమని మేయర్ గుప్తా చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పిన ఆయన.. పేదలకు, సన్యాసులు మొదలైనవారికి పది రూపాయిలకే భోజనం అందించనున్నారని అన్నారు. దీనివల్ల ఎంతో మంది లబ్ది పొందుతారని.. ఇది మంచి ఆలోచన అని .. మంచి భోజనం ఇక్కడ దొరుకుతుందని చెప్పారు.


దిలీప్‌ అలియాస్‌ కాకె ఈ థాలీని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఆకలితో నిద్రించకూడదనేది తమ ఆలోచన అని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రమిస్తున్నందుకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. అలహాబాద్ అత్తర్సుయ ప్రాంతం సమీపంలో ఈ భోజన సౌకర్యం ప్రారంభమైంది.