TMC Candidates: పార్లమెంట్‌ ఎన్నికల నగారా రెండు మూడు రోజుల్లో రాబోతుందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవాలనే ఆశతో ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన వారిని వల వేస్తున్నారు. వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించి వెంటనే టికెట్‌ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌కు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో యూసుఫ్‌ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడితో యూసుఫ్‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kamal Haasan: ఎంపీ ఎన్నికలకు కమల్ హాసన్ రాంరాం.. డీఎంకే పార్టీతో కుదిరిన పొత్తు


 


పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించారు. వారిలో మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ కూడా ఉన్నారు. బెహరంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు మమత ప్రకటించారు. కోల్‌కత్తాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో యూసుఫ్‌ పఠాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అతడికి కండువా కప్పి స్వాగతించిన మమత నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు.

Also Read: X TV App: ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం.. యూట్యూబ్‌కు పోటీగా టీవీల్లోనూ 'ఎక్స్' ట్విట్టర్

ఇదే వేదిక నుంచి రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. యూసుఫ్‌ పఠాన్‌ ఎంపిక మమత వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు బీజేపీని దెబ్బకొట్టేందుకు యూసుఫ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. యూసుఫ్‌ ద్వారా ముస్లిం ఓట్లను కొల్లగొట్టే ప్రణాళిక వేసింది. ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న మమత అత్యధిక స్థానాలు గెలుపొందడంపైనే దృష్టి సారించారు.


యూసుఫ్‌ కీలక ఇన్నింగ్స్‌
క్రికెట్‌లో తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్న యూసుఫ్‌ పఠాన్‌ మరి రాజకీయాల్లో ఏ స్థాయిలో ఆడుతారో చూడాలి. యూసుఫ్‌ పోటీ చేసే స్థానం బెహరంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదుసార్లు ఎంపీగా ఎన్నికవుతున్న అధిర్‌ రంజన్‌పై యూసుఫ్‌ పోటీకి దిగుతున్నాడు. క్రికెటర్‌గా దిగిపోయిన తర్వాత యూసుఫ్‌ పఠాన్‌కు రాజకీయాల్లో అవకాశం లభించింది. మరి రాజకీయ ఇన్నింగ్స్‌లో యూసుఫ్‌ ఎలా ఆడుతాడో వేచి చూడాలి. యూసుఫ్‌ అభ్యర్థిగా ప్రకటించడంపై సిట్టింగ్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ స్పందించారు. 'యూసుఫ్‌ను గౌరవించాలనుకుంటే రాజ్యసభకు నామినేట్‌ చేయవచ్చు. అతడితో మమతకు సత్సబంధాలు లేవు. ఓటర్లను ఆకట్టుకునేందుకు, కాంగ్రెస్‌ను ఓడించేందుకు వ్యూహత్మకంగా వేసిన ఎత్తుగడ ఇది' అని పేర్కొన్నాడు.

 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter