Zee Digital Tv: జీ గ్రూప్ మరో సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. జీ గ్రూప్ ఆధ్వర్యంలో దక్షిణాది నాలుగు భాషల్లో తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. జీ తెలుగు న్యూస్ , జీ కన్నడ న్యూస్, జీ మళయాలం న్యూస్, జీ తమిళ్ న్యూస్ పేరుతో దేశంలో తొలిసారిగా డిజిటల్ టీవీ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ కలిగిన జీ గ్రూప్..ఇవాళ నాలుగు దక్షిణాది భాషల్లో డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభించింది. తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్ వేదికగా జీ తెలుగు న్యూస్, కన్నడ ప్రేక్షకుల కోసం బెంగళూరు వేదికగా జీ కన్నడ న్యూస్, కేరళ కోసం జీ మళయాలం న్యూస్, చెన్నై వేదికగా జీ తమిళ్ న్యూస్ డిజిటల్ టీవీలు ప్రారంభమయ్యాయి.  కంటెంట్ , న్యూస్ పరంగా నాణ్యత కచ్చితంగా ఉంటుందని జీ గ్రూప్ భరోసా ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగం ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే ఎక్కువ. 2018-20లో వీడియోలు చూసే టైమ్ 60-70 శాతం పెరిగిందని తెలుస్తోంది. అందులో 85 శాతం ఇంగ్లీషేతర భాషలు చూస్తుంటారు. 68 శాతం ప్రజలు డిజిటల్ మాధ్యమం ద్వారా న్యూస్ తెలుసుకుంటుంటారు. స్థానికంగా ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా పక్షపాతం లేకుండా జీ గ్రూప్ (Zee Group) న్యూస్ అందించనుంది. 


డిజిటల్ న్యూస్ ద్వారా దక్షిణాది మార్కెట్‌లో (South Market) ప్రవేశించేందుకు ఇదొక మంచి అవకాశమని జీ గ్రూప్ క్లస్టర్ 2 సీఈవో పురుషోత్తమ్ వైష్ణవ్ తెలిపారు. వార్తల్ని పక్షపాతం లేకుండా నిజాయితీ అందించే విషయంలో మార్కెట్‌లో స్పేస్ గమనించామని..ఈ స్పేస్‌ను జీ గ్రూప్ భర్తీ చేస్తుందని చెప్పారు. అత్యధిక విశ్వసనీయత కలిగిన న్యూస్ బ్రాండ్‌గా నిలబడటమే తమ లక్ష్యమన్నారు. ఈ ఛానెల్స్ అన్నీ ఇండియా డాట్‌కామ్ పరిధిలో ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు వివిధ రకాల మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేశామన్నారు. దక్షిణాది డిజిటల్ ఛానెల్స్ సేల్స్ హెడ్‌గా ఉన్న ఉదయ కుమార్..మార్కెట్ గురించి మాట్లాడారు. డిజిటల్ న్యూస్ టీవి అనేది ఓ కొత్త ప్రయోగమన్నారు. చదువుకున్న ప్రతి ప్రేక్షకుడి కోసం మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశామన్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, లైఫ్‌స్టైల్, ఆరోగ్య వంటివి ప్రధానంగా ఉంటాయన్నారు. 4 దక్షిణాది భాషల్లో మంచి రెవిన్యూ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 


జీ తమిళ్ న్యూస్ (Zee Tamil News) కోసం www.zeetamilnews.com, జీ తెలుగు న్యూస్ (Zee Telugu News) కోసం www.zeetelugunews.com, జీ కన్నడ న్యూస్ (Zee Kannada News) కోసం www.zeekannadanews.com, జీ మళయాలం న్యూస్ (Zee Malayalam News) కోసం www.zeemalayalamnews.com లు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, జీ5 (Zee 5) ఓటీటీ ప్లాట్ ఫామ్, డైలీ హంట్ వంటి న్యూస్ అగ్రిగేటర్ల వేదికలపై అందుబాటులో ఉండనున్నాయి.


జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ కలిగిన సంస్థ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 8 విభిన్న భాషల్లో 14 ఛానెల్స్ తో 3 వందల మిలియన్ల వ్యూయర్లను కలిగి ఉంది. జీ న్యూస్ డాట్‌కామ్, డీఎన్ఏ ఇండియా డాట్‌కామ్, ఇండియా డాట్‌కామ్‌లు కూడా ప్రాచుర్యంలో ఉన్న వెబ్‌సైట్స్ కావడం విశేషం.


Also read: Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.