ZEEL-Sony Merge: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్ ఇండియాతో (SPNI) విలీనం ఒప్పందానికి దిగ్గజ మీడియా కంపెనీ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) డైరెక్టర్ల బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ-సోనీ విలీనం గురించి మనం అందరం తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలు ఇవే....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MD మరియు CEO ఎవరు?
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) మరియు సోనీ పిక్చర్స్ ఇండియా రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డ్ ఏకగ్రీవంగా విలీనానికి ఆమోదం పొందిన తరువాత కూడా పునీత్ గోయెంకా (Punit Goenka) మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా కొనసాగనున్నారు. ఈ విలీనం అనంతరం పునీత్ గోయెంక సంస్థలో 157.5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. 


విలీనం తరువాత, విలీన సంస్థలో అధిక వాటా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉండనుంది. ఇరు కంపెనీలు నాన్-బైండింగ్ నిబంధనపై కూడా సంతకం చేశాయి. ఇక ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు నిర్దేశించారు, విలీనం తరువాత, ఏర్పడిన వీలీన సంస్థ భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో (Indian stock exchanges) చేర్చ బడుతుంది. 


Also Read: ZEEL, Sony merger deal: జీల్, సోనీ విలీనంపై కీలక ప్రకటన.. మీడియా ప్రపంచంలో కీలక పరిణామం


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) మరియు సోనీ పిక్చర్స్ ఇండియా (SPNI) రెండు కంపెనీలు నాన్-కాంపిటీషన్ ఒప్పందంపై (Non-Compete Agreement) సంతకం చేయనున్నాయి. జీల్ (ZEEL)లో పెట్టుబడి పెట్టె పెట్టుబడిదారులు వీలీన కంపెనీలో 47.07 శాతం వాటాను కలిగి ఉండనున్నారు. 


జీల్-సోనీ డీల్ ఎంత పెద్దది?
ఈ విలీనంతో, రెండు కంపెనీల కంటెంట్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జీల్ (Zeel) కు మూలధన ప్రాప్తిలో వృద్ది లభిస్తుంది. మరో వైపు, వీలీనం ద్వారా సోనీ (Sony) భారతదేశంలో తన ఉనికిని పెంచుకునే అవకాశాన్ని పొందుతుంది.




Also Read: Attack on Asaduddin Owaisi residence: అసదుద్దీన్ ఒవైసి నివాసంపై దాడి.. గేటు ధ్వంసం


జీల్స్ బిజినెస్
జీల్ (ZEEL) 10 భాషలలో, 100 కంటే ఎక్కువ ఛానెల్‌లతో 190 దేశాలలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ప్రేక్షకులలో 19 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. టీవీ కంటెంట్ 2.6 లక్షల గంటల కంటే ఎక్కువ. జీ 5 (Zee5) ద్వారా డిజిటల్ మార్కెట్లో మంచి పట్టు ఉంది. దేశంలో విడుదలయ్యే సినిమాలలో దాదాపు 25 శాతం సినిమాలు జీ నెట్ వర్క్ లో ప్రసారం అవుతాయి. 


సోనీ బిజినెస్
మన దేశంలో సోనీ 31 ఛానెల్‌లతో 167 దేశాలలో అందుబాటులో ఉంది. దేశంలో సోనీ 700 మిలియన్ల (700 million viewers) మంది వీక్షకులతో, ప్రేక్షకులలో 9 శాతం మార్కెట్ షేర్ ను కలిగి ఉంది. 


Disclaimer: జీ ఎంటర్‌టైన్‌మెంట్ మా సిస్టర్/గ్రూప్ కంపెనీ కాదు. పేర్లు ఒకేలా ఉన్నప్పటికీ, మా కంపెనీ జీ మీడియా కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది, ఇది వేరే గ్రూప్. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook