5 Superfoods for weight loss: బరువు తగ్గాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఎక్సర్‌సైజ్ లాంటివి కూడా ప్రయత్నిస్తుంటారు. కానీ బరువు తగ్గడం కష్టం అవుతుంది. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలు మన డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గిపోతారు. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సూపర్ ఫుడ్స్ లో మన శరీరం కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.


బూస్ట్ మెటబాలిజం..
కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ లో మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.  అంతేకాదు ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ లో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల ఇది కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఎక్కువ సమయం పాటు ఆకలి వేయటం బరువు పెరగకుండా ఉంటారు. సూపర్ ఫుడ్స్ లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ బరువు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెరగకుండా నిర్వహిస్తాయి అలాంటి సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.


అవకాడో..
అవకాడో బరువు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అవకాడో చూడటానికి క్రీమీ మాదిరి కనిపిస్తుంది. ఇందులో ఎన్నో రకాల పుష్కలంగా ఉంటాయి. అవకాడ డైట్లో చేర్చుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అవకాడోలో క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి.


క్వినోవా..
క్వినోవాలో కూడా మన శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అంతేకాదు క్వినోవా తినడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి లేదు. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో అనవసరంగా అనారోగ్యకరమైన ఆహారం తినకుండా ఉంటాం.


ఇదీ చదవండి: మీ ముఖానికి సరిపోయే షీట్ మాస్కులు ఎలా ఎన్నుకోవాలో తెలుసా?


చియా సీడ్స్..
బరువు పెరగకుండా కాపాడే మరో సూపర్‌ ఫుడ్ చియా సీడ్స్. ఇందులో పోషకాలు పుష్కలం ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగి ఉంటుంది. దీంతో అధికంగా బరువు పెంచే ఆహారాలు జోలికి వెళ్లకుండా ఉంటారు.


సాల్మాన్..
ఈ ఫ్యాటీ ఫిష్ కూడా సూపర్ ఫుడ్. ఇందులో బరువు పెరగకుండా కాపాడే పోషకాలు ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు వాపు సమస్యను తగ్గించే లక్షణాలు ఉంటాయి. సాల్మాన్‌ చేప మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇవి బరువు పెరగకుండా చేస్తాయి.


ఇదీ చదవండి: ఈ 7 పండ్లను తింటూ ఉంటే చాలు.. మీ జుట్టు మందంగా దృఢంగా పెరుగుతూనే ఉంటుంది..


గ్రీన్ టీ..
గ్రీన్ టీ కూడా ఎంతో ఆరోగ్యకరమైన డ్రింక్. ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ టీ  లో కెటాచిన్ ఉంటుంది. ఇది మెటాబాలిజం రేటును పెంచడంతోపాటు క్యాలరీలను బర్న్ చేస్తాయి  వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవాళ్లు గ్రీన్ టీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి