Acidity: అజీర్ణం, గ్యాస్ సమస్యలకు వీటితో కేవలం 5 నిమిషాల్లో చెక్ పెట్టండి..
Gas Acidity Rid In 5 Minutes: ప్రస్తుతం చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి లెమన్ వాటర్‌ని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియ శక్తిని కూడా పెంచుతుంది.
Gas Acidity Rid In 5 Minutes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా ఎక్కువ కారంగా లేదా వేయించిన-రోస్ట్ తినడం అజీర్ణం లేదా గ్యాస్ సమస్యను ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న వాటిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ వాటర్:
అజీర్ణం, గ్యాస్ తొలగించడానికి నిమ్మకాయ నీరు ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ సమస్య నుంచి సులబంగా ఉపశమనం పొందడానికి కావాలంటే కాస్త వేడిగా లేదా చల్లగా తాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే.. జీర్ణవ్యవస్థలో సమస్యలు సులభంగా తగ్గుతాయి. అయితే ఈ రసాన్ని ప్రతి రోజు 2 నుంచి 3 గ్లాసులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం, తులసి:
అజీర్ణ, గ్యాస్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. అల్లం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా అల్లాన్ని నీటిలో మరిగించి.. ఆపై ఈ నీటిని వడపోసి త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల కడుపునొప్పి, గ్యాస్ రెండింటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే పొట్ట సమస్యలకు తులసి ఆకులు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఇంట్లో ఉండే ఆపిల్ వెనిగర్ కూడా పొట్ట సమస్యలను ప్రభావవంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా గ్యాస్, ఇతర కడుపు సమస్యలను తొలగించడాని కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, సరిగ్గా కలిపిన తర్వాత తాగాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దానిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!
Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook