Black Raisins: మీ డైలీ డైట్లో అవి చేర్చుకుంటే..వృద్ధాప్య ఛాయలు దరిదాపులకు రావు
Black Raisins: వయసు పెరిగేకొద్దీ వృద్ధాప్యఛాయలు సర్వ సాధారణమే. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో వయసు మళ్లుతున్నా..వృద్ధ్యాప్య ఛాయలు పడకుండా, చర్మం కాంతివంతంగా ఉండేట్టు చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Black Raisins: వయసు పెరిగేకొద్దీ వృద్ధాప్యఛాయలు సర్వ సాధారణమే. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో వయసు మళ్లుతున్నా..వృద్ధ్యాప్య ఛాయలు పడకుండా, చర్మం కాంతివంతంగా ఉండేట్టు చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బ్లాక్ కిస్మిస్ పండ్లు అందరికీ తెలిసినవే. అన్ని చోట్లా విస్తృతంగా లభించేవే. ఈ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయజనాలు అన్నీ ఇన్నీ కావు. రుచికే కాదు..అద్భుతమైన లాభాలున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు మీదపడకుండా చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..
రక్తపోటు నియంత్రణలో..
మనం తినే ఆహారంలో కిస్మస్ పండ్లు ఉండేట్టు చూసుకుంటే చాలా రకాల ఆనారోగ్య సమస్యల్నించి కాపాడుకోవచ్చు. కిస్మస్ పండ్లతో ఏయే రకాల అనారోగ్య సమస్యలున్నవారికి ప్రయోజనమో తెలుసుకుందాం. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బ్లాక్ కిస్మస్ పండ్లు తింటే చాలా మంచిది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ కిస్మస్ పండ్లతో పోలిస్తే..బ్లాక్ కిస్మస్‌లో అధిక ఔషధ గుణాలుంటాయి. రక్త సరఫరా మెరుగుపడటంతో హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్ కిస్మిస్ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటిచూపును మెరుగుపర్చడంలో దోహదపడతాయి. కళ్లలోని కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
వృద్ధాప్య ఛాయలు దూరం
బ్లాక్ కిస్మస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. బ్లాక్ కిస్మస్ పండ్లు తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతాయి. విషపదార్ధాలు నశిస్తాయి. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువ. ఫలితంగా మీ చర్మం మరింత కాంతివంతమై..వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి.
ఎముకలు, కండరాలకు బలం
బ్లాక్ కిస్మస్‌లో పొటాషియం, కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు ధృడంగా ఉంటాయి. ఆస్టియో పోరోసిస్, ఆర్ధరైటిస్ సమస్యలున్నవారు ప్రతిరోజూ కిస్మస్ పండ్లు తింటే చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా దోహదపడతాయి.
స్థిరంగా మెటబాలిజం
కిస్మస్ పండ్లు నానబెట్టిన నీటిని తాగడం వల్ల బాడీ మెటబాలిజం స్థిరంగా ఉంటుంది. దంత సంబంధిత సమస్యల్నించి కూడా బ్లాక్ కిస్మస్ రక్షిస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా బ్లాక్ కిస్మస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు దోహదపడుతుంది. శరీరపు మెటబాలిజం స్థిరంగా ఉండటంతో..బరువు పెరగకుండా నియంత్రణంలో ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.