Ajwain Water Benefits: ఈ ఆకులతో సీజనల్ వ్యాధులు, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకానికి 2 రోజుల్లో చెక్!
Celery For Seasonal Diseases: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వాము ఆకులను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా దూరమవుతాయి.
Celery For Seasonal Diseases: భారత్ పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు వర్షాలు కురస్తున్నాయి. కాబట్టి చాలా మందిలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా జలుబుతో పాటు జ్వరం, ఇన్‌ఫెక్షన్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడం వల్ల చాలా మందిలో రోగనిరధక శక్తి కూడా దెబ్బతింటుంది. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరం బలహీనత నుంచి తట్టుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి చిట్కాలు పాటిస్తే సీజనల్ వ్యాధులు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాముతో సీజనల్ వ్యాధులకు చెక్:
ప్రతి రోజు వామును ఆహారాల్లో వినియోగిస్తారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి సీజన్ వ్యాధుల నుంచి పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో దీనిని వినియోగించాల్సి ఉంటుంది.
వాము ఆకులతో కూడా సులభంగా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటి ఆకులను నీటిలో మరిగించి టీలా తయారు చేసుకొని తాగడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో మూలకాలు లభిస్తాయి. కాబట్టి శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణుల తెలుపుతున్నారు.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
వాము, వాటి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వాము ఆకును క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా జలుబు-దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వాము ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.
పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తరచుగా వాము ఆకులను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook