How To Make Aloe Vera Hair Oil: ఒత్తైన, అందమైన జుట్టు అంటే అందరికీ ఇష్టం. వివిధ కారణాల వల్ల చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జట్టు రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన అలోవెరా హెయిర్ ఆయిల్‌ను జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది. కలబందలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది డ్రై స్కాల్ప్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. కలబంద హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలోవెరా హెయిర్ ఆయిల్ తయారీకి అవసరమైన పదార్థాలు:
>>అలోవెరా జెల్
>>కొబ్బరి నూనె


అలోవెరా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి?:
కలబంద హెయిర్ ఆయిల్‌ను తయారు చేయడానికి ముందుగా కలబంద జెల్ తీసుకోండి.
తర్వాత మిక్సీ జార్‌లో వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
అంతేకాకుండా పైన మిశ్రమాన్ని ఓ గిన్నెల వేసుకోవాల్సి ఉంటుంది.
కొబ్బరి నూనె, కలబంద గుజ్జు మరిగించాల్సి ఉంటుంది.
అది నల్ల రంగులోకి మారే దాకా మరిగించాల్సి ఉంటుంది.
తర్వాత దానిని వడకట్టి  సీసాలో నిల్వ చేసుకోవాలి.


అలోవెరా హెయిర్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి?:
తలస్నానానికి 3-4 గంటల ముందు అలోవెరా హెయిర్ ఆయిల్‌ను మీ జుట్టుకు అప్లై చేయండి.
ఈ నూనెను మీ జుట్టు యొక్క మూలాలు, చిట్కాలలో బాగా అప్లై చేయాల్సి ఉంటుంది.
తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!


Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook