Health Benefits with Turmeric water: పసుపు మన వంటింటి కిచెన్ లో కచ్చితంగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఏదైనా గాయాలు అయినా గాని వెంటనే పసుపు పెట్టడం మనకు అలవాటు అయితే స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోవడం వల్ల మీకు ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు నీటిని ఎలా తయారు చేసుకోవాలి?
బకెట్ నిండా స్నానం చేసే నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసి కాసేపు ఉంచాలి ఆ తర్వాత నీటితో స్నానం చేయాలి


పసుపు నీటితో ఆరోగ్య ప్రయోజనాలు..
జ్యోతిష్యం ప్రకారం కూడా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగెటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు పసుపులో శుభ్రపరిచే గుణాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని క్లిన్సింగ్ చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పసుపు నీటితో స్నానం చేయడం వల్ల శ్రేయస్సు  కలుగుతుంది.


పెళ్లి యోగం..
పెళ్లి కాని వారు, పెళ్లి సమస్య ఉన్నవారు ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల త్వరగా పెళ్లి యోగం కలుగుతుంది. అంతేకాదు గురువారంనాడు పసుపు తిలకం ధరించాలి ఇది విష్ణుమూర్తికి ప్రీతికరం.  ఈ రెండు రెమెడీలు ప్రయత్నిస్తే త్వరగా పెళ్లి యోగం కలుగుతుంది. మీకు పాజిటివిటీ కలిసి వస్తుంది.


ఇదీ చదవండి: ముఖం నల్లమచ్చలను సహజసిద్ధంగా తగ్గించే హోం రెమిడీ..


గురు బలం..
మీ జాతకంలో గురు బలం తక్కువగా ఉంటే నీ జీవితంపై దుష్ప్రభావాలు కలుగుతాయి .పసుపు నీటితో స్నానం చేయాలి . దీనివల్ల గురు దోషాలు కూడా తొలగిపోతాయి పసుపుని గణేశుని ప్రతిరూపంగా కూడా కొలుస్తారు . దీంతో వినాయకుని ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. మన పెళ్లి ఆచారాల్లో కూడా పసుపుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పసుపు తోనే మన పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. దీంతో సుఖ సంతోషాలు కలుగుతాయి.


ఇదీ చదవండి: గులాబీనీటితో మెరిసే అందం మీ సొంతం.. ముఖం కాంతివంతమవుతుంది.


పసుపులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మన చర్మ ఆరోగ్యానికి మంచిది. యాక్నే వంటి చర్మ సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ముఖంపై పిగ్మెంటేషన్ ఉంటే త్వరగా వదిలిపోతుంది. పసుపు పెట్టుకోవడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వెంటనే వైద్యులను కలవడం మేలు. తరతరాలుగా పసుపును మన సంప్రదాయంలో వినియోగిస్తారు ఇందులో మెడిసినల్ గుణాలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter