Andhra Chilli Chicken Recipe In Telugu: చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో చేసుకుంటారు ముఖ్యంగా తెలంగాణ లోని మారుమూల ప్రాంతాలలో ఒక విధంగా చేసుకుంటే ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఒక విధంగా చేసుకుంటారు. చికెన్ చేసుకున్న దాని టేస్టే వేరు. అయితే ఇలాంటి చికెన్ పచ్చిమిరపకాయలతో చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇక ఆ టెస్ట్‌ని మాటల్లో వర్ణించడం కష్టం. ఆంధ్రాలోని చాలా ప్రాంతాల్లో చిల్లి చికెన్ కర్రీని ఎక్కువగా చేసుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పేరు మోసిన రెస్టారెంట్లలో చిల్లి చికెన్ హైలెట్ డిష్‌గా ఉంటోంది. అయితే మీరు కూడా ఇంట్లోనే చిల్లి చికెన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేకమైన రెసిపీ మీకోసమే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తయారీకి కావలసిన పదార్థాలు:
✾ 600 గ్రాముల బోన్ లెస్ చికెన్
✾ రుచికి సరిపడాల్సిన ఉప్పు
✾ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం
✾ 15 నుంచి 17 వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి
✾ మూడు ఇంచుల అల్లం ముక్క
✾ 15 వెల్లుల్లి రెబ్బలు
✾ ఒక చిన్న కప్పు పుదీనా ఆకులు
✾ మరో చిన్న కప్పు కొత్తిమీర ఆకు
✾ ఒకటి స్పూన్ జిలకర
✾ ఒక చిన్న కప్పు పల్లీ నూనె
✾ మూడించుల దాల్చిన చెక్క
✾ ఒక కప్పు చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు
✾ ఒకరెమ్మ కరివేపాకు
✾ తగినంత కారం
✾ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి
✾ రెండున్నర కప్పుల నీరు


చెల్లి చికెన్ తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద కప్పు తీసుకొని అందులో చికెన్ వేసి నిమ్మరసం ఉప్పు కలిపి మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓ గ్రైండర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, రెబ్బలు, జీడిపప్పు, అల్లం, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసి బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్‌పై కళాయి పెట్టుకుని అందులో ఒక కప్పు నూనెను పోసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత జీలకర్ర, మసాలా దినుసులు వేసి బాగా వేయించుకోవాలి 


ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లి ముక్కలతో పాటు కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన పెట్టిన చికెన్ ని ఆ కళాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఆ తర్వాత సన్నని మంటపై వేయించుకుంటూ పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, చికెన్ మసాలా, స్పెషల్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వెంటనే రెండు కప్పుల నీటిని పోసుకొని గ్రైండర్ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ వేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు సన్నని మంటపై నూనె పైకి వచ్చేంతవరకు వేయించుకోవాలి.. ఇలా వేయించుకున్న తర్వాత పైనుంచి పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter