Hair Oiling Tips: మీ జుట్టుకు తగినంత పోషణను అందడానికి మీ జుట్టుకు కనీసం వారానికి రెండుసార్లు నూనె రాయాలి అంటున్నారు నిపుణులు.జుట్టుకు తరచూ నూనెలు రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది. కానీ, ఈ బిజీ లైఫ్ లో హెయిర్ ఆయిల్ రాయడం తగ్గించేశారు. కనీసం వారానికి రెండురోజులైనా జుట్టుకు తప్పకుండా నూనెరాయాలి అది కూడా సరైన పద్ధతిలో అంటున్నారు నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. జుట్టకు నూనె రాసుకునన్నాక చాలామంది హెయిర్ గట్టిగా కట్టుకుంటారు. ఇలాంటి పొరపాటు చేయకూడదు. దీంతో హెయిర్ స్ప్లిట్ ఎండ్ సమస్యలు మొదలవుతాయి. తలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. జుట్టు రాలిపోతుంది కూడా. 


2. అంతేకాదు హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా జుట్టును గట్టిగా రుద్దుతారు ,మసాజ్ చేస్తారు . ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి, జుట్టుకు నూనె రాసేటప్పుడు ఈ తప్పు చేయకండి.. 


3. కొంతమంది నూనె రాసుకున్న వెంటనే జుట్టును గట్టిగా దువ్వడం మొదలెడతారు. చిక్కులు తీసే క్రమంలో ఇలా చేస్తారు కానీ, ఈ విధంగా జుట్టును దువ్వితే హెయిర్ ఫాల్ సమస్య మరింత పెరుగుతుంది.జుట్టు బలహీనమైపోతుంది.


4. జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టుకు లోతైన పోషణ లభిస్తుంది. అయితే, జుట్టుకు ఆయిల్ ఎక్కువ సేపు ఉంచడం మంచిదని రాత్రంతా జుట్టుకు ఆయిల్ పెట్టి వదిలేయడం కూడా తగదు. దీని వల్ల జుట్టుకు మరింత సంరక్షణ లభిస్తుందనేది అపోహ.


జుట్టుకు నూనె రాయడం ఎలా?
మీరు ఎప్పుడు జుట్టుకు నూనె రాయాలనుకున్నా నూనె ఎప్పుడూ గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. పొడి జుట్టుకు నూనెను రాయండి. సుమారు 1 నుండి 2 గంటలపాటు అలాగే వదిలివేయండి. ఆ తర్వాత జుట్టును సాధారణ షాంపూతో బాగా కడగాలి. ఈ సమయంలో జుట్టును ఎక్కువగా రుద్దకండి. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


ఇదీ చదవండి:  Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!


ఇదీ చదవండి: Home Cleaning Tips: రూ.2 కాఫీ సాచెట్ మీ ఇంటికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook