Hair Fall Remedy: ఈ సమస్య చాలా మంది ఈ కాలంలో ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు విపరీతంగా ఊడిపోయి మాడు కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సమతుల ఆహారం తీసుకుంటూ విటమిన్స్, మినరల్స్, జింకు, బయోటిన్ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి అయితే హెయిర్ ఫాలికల్స్ లో కూడా బ్లడ్ సర్కులేషన్ మెరుగ్గా ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు విపరీతంగా ఊడుతున్న వారికి మంచి రెమిడీ ఉంది అది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలబంద..
కలబందలో ప్రోటోలైట్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా రిపేర్‌ చేసి డెడ్ సెల్స్ ని సైతం పునరుజ్జీవనం అందిస్తుంది ఆరోగ్యంగా పెరుగుతుందని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.


గుడ్లు..
గుడ్లలో సల్ఫర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది జుట్టు మందంగా పెరుగుతుంది. దీంతో మీ జుట్టుకు గ్లాసీ లుక్‌ కూడా పొందుతారు. మీ రెగ్యులర్ డైట్లో గుడ్లు చేర్చుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.


ఉసిరి..
జుట్టు రాలే సమస్యకు ఉసిరి కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. అంతే కాదు ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా పెరుగుతుందని ఎన్ఐహెచ్ తెలిపింది.


మెంతులు..
సైంటిఫిక్ డేటా ప్రకారం మెంతుల్లో జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. మెంతులను కొబ్బరినూనె లేదా పేస్టు మాదిరి తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.


ఇదీ చదవండి: ఈ ఆహారాలు తిన్నారంటే ఎక్కువ కాలం బతుకుతారు.. మీరూ తింటున్నారా?


హెన్నా ఆకులు..
హెన్నా ఆకులు కూడా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి డాండ్రఫ్ కి చెక్ పెట్టి అలపేషియా సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ప్రోత్సహిస్తుందని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.


కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో పొటాషియం లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు బ్రేక్ కాకుండా కాపాడుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీంతో ఇవి జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా పెంచి డాండ్రఫ్ ని దూరంగా ఉంచుతుంది. దీంతోపాటు ఆముదం లేదు బాదం నూనె కలిపి అప్లై చేయడం వల్ల సరైన ఫలితాలు లభిస్తాయి.


ఇదీ చదవండి: పసుపుతో తయారు చేసే ఈ మాస్క్‌ ముఖానికి మచ్చలు లేకుండా గోల్డెన్‌ గ్లో ఇస్తుంది..


ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసంలో కూడా జుట్టును ఆరోగ్యంగా పెంచే గుణాలు ఉంటాయి. ఇది జుట్టు రాలే సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీ. ఊడిన జుట్టును కూడా తిరిగి పెరిగేలా చేసే గుణం దీనిలో ఉంటుంది. హెయిర్ ఫాలికల్ డామేజ్ కాకుండా కాపాడుతుందని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి