Summer Habbits: వేసవి ప్రారంభమైపోయింది. ఓ వైప ఎండల తీవ్రత పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అలవాట్లేంటనేది చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్‌ను బట్టి ఆహారం తీసుకోవల్సి ఉంటుంది. శీతాకాలంలో తీసుకునేవి కొన్ని వేసవిలో తీసుకోకూడదు. వేసవిలో తీసుకునేవాటిలో కొన్ని శీతాకాలం లేదా వర్షాకాలంలో తీసుకోవడం మంచిది కాదు. ఇలా సీజన్‌ను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయి. శీతాకాలంలో మనం తిన్న ఆహారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటే.. మన శరీరంలో ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయని, వివిధ సమస్యలపై దృష్టి సారించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో వేసవిలో దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్ధాలివే..


టీ లేదా కాఫి : శీతాకాలంలో ఒక కప్పు టీ లేదా కాఫీ తీసుకున్నప్పుడు శరీరానికి హాయినిస్తుంది. కానీ, ఇప్పుడు వాతావరణం మారే కొద్దీ..పరిస్థితి మారుతుంది. వేసవిలో కూడా అదే పనిగా టీ లేదా కాఫీలు తాగితే వేడి చేస్తుంది. ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి ఎదురవుతుంది. టీ, కాఫీ తీసుకునే అలవాటు ఉంటే బదులుగా తర్భూజ, ఖర్భూజ జ్యూస్, బట్టర్ మిల్క్ వంటి చల్లగా ఉండే పదార్థాలను రుచిగా తినవచ్చు.


శీతాకాలంలో శరీరం నూనె పదార్ధాల్ని చాలా తేలికగా జీర్ణం చేస్తుంది. కానీ, వాతావరణం మారినప్పుడు అంటే వేసవిలో అలా జరగదు. నూనె పదార్ధాలు త్వరగా జీర్ణం కాక..ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎండాకాలంలో శరీరానికి చల్లగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇప్పుడు స్నాక్స్‌ కోసం ఆయిల్ ఫుడ్‌లకు బదులుగా వేగంగా జీర్ణమయ్యే ఆహారధాన్యాలను తీసుకోవచ్చు.


ఇక వేసవిలో అల్లం టీ లేదా మసాలా కలిపిన శీతాకాలంలో మనం అల్లం బాగా వినియోగిస్తాం. కానీ వేసవిలో చాలావరకూ తగ్గించాల్సి ఉంటుంది లేకపోతే వేడి చేయడమే కాకుండా..గుండెల్లో దడ పుడుతుంది. మరోవైపు వేసవి కాలంలో ఉల్లిపాయలు సాధ్యమైనంతవరకూ తగ్గించడం మంచిది.


Also read: Finger Millets: సోళ్లు పిండి లేదా రాగులతో అద్భుత ప్రయోజనాలివే..వేసవి ఆహారమిది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook