Allergy: డస్ట్ అలర్జీ రాకుండా ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసం..!
Ayurvedic Tips For Allergy: అలెర్జీలు అనేది సాధారణ విషయం. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ఆయుర్వేదం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Ayurvedic Tips For Allergy: మారుతున్న సీజన్‌లో అలర్జీలు చాలా సాధారణం. దుమ్ము కొన్ని ఆహారాలు వంటివి అలర్జీలకు కారణమవుతాయి. దీనివల్ల దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆయుర్వేదం ఈ సమస్యలకు సహజమైన పరిష్కారాలను అందిస్తుంది. ఆయుర్వేద పానీయాలు అలర్జీలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
వాతావరణ మార్పులు, దీపావళి పండుగ, మెట్రో నగరాల కాలుష్యం... ఇవన్నీ కలిసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుర్వేదం మనకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తోంది. ఆయుర్వేద నిపుణులు సిఫారసు చేసే పానీయం గొంతు, ముక్కులోని అలెర్జీలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కేవలం గొంతు నొప్పిని మాత్రమే తగ్గించదు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్యాల నుంచి కూడా రక్షిస్తుంది.
కలబంద జ్యూస్:
కలబంద జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది గొంత వాపు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. కలబంద రసం అన్ని విధాలుగా సహాయపడుతుది.
తులసి జ్యూస్:
తులసి ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మొక్క ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. గొంతు నొప్పి, అలర్జీలు, అంటువ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు ఉన్నవారు తులసి జ్యూస్‌ను తప్పకుండా తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా కలబందలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గాయాలు త్వరగా మానేందుకు, దురద తగ్గించడానికి సహాయపడతాయి. కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
తులసి దగ్గు, జలుబు, అలర్జీలు వంటి శ్వాసకోశ సమస్యలకు చక్కటి మందు. తులసి మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
ముగింపు:
కలబంద, తులసి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేసే మూలికలు. ఈ రెండింటిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ రెండిటినీ ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. తీవ్రమైన దగ్గు, అలర్జీ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook